
Balayya: బాలయ్య అఖండ సక్సెస్ వెనుక జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడని… పేర్నినాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి, జగన్ పై బాలయ్య చేసిన కామెంట్స్ నేపథ్యంలో… సీన్ లోకి పేర్ని నాని వచ్చారు. జగన్ అపాయింట్మెంట్ కావాలని బాలకృష్ణ స్వయంగా నాకు ఫోన్ చేశాడని గుర్తు చేశారు పేర్ని నాని.
Jagan is behind Balayya’s huge success
అఖండ సినిమా టైంలో బాలకృష్ణ నాకు కాల్ చేశాడని తెలిపారు పేర్ని నాని. టికెట్ రేట్ల విషయంలో సహకరించాలని మమ్మల్ని అఖండ నిర్మాత కోరారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. ఇదే విషయం జగన్ కి చెప్తే వాళ్లకు కావాల్సింది చేసేయండి అని చెప్పాడని స్పష్టం చేశారు మాజీ మంత్రి పేర్ని నాని.
Also Read: Surya Kumar Yadav: సూర్య కుమార్ యాదవ్ పై పాకిస్తాన్ కొత్త కుట్రలు ?
చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే బాలకృష్ణకు ఈర్ష్య, ద్వేషం. మెగా బ్రదర్స్ అంటే ఆయనకు పడదని ఆగ్రహించారు మాజీ మంత్రి పేర్ని నాని. బసవతారకం ఆసుపత్రికి సంబంధించిన ఆరోగ్యశ్రీ బిల్లులు మా బావ పెండింగ్ లో పెట్టారు అని హరికృష్ణ అనే అధికారితో బాలకృష్ణ చెప్తే వెంటనే జగన్ ఆ బిల్లులు క్లియర్ చేయించాడని గుర్తు చేశారు. జగన్ ఎందుకు సైకో? ఒక్కరోజైనా బసవతారకం ఆసుపత్రిని ఇబ్బంది పెట్టాడా? అని ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని నాని.
Also Read: Dating Apps: డేటింగ్ యాప్ లో పరిచయం..ఇద్దరు అబ్బాయిలు రొ**మాన్స్?





