
Bhatti Vikramarka: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ఓ ఛానల్ చైర్మన్ తొలిపలుకు అని వార్త రాసారని నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే వార్త కథనాలు రాసారని రాసారని ఆగ్రహించారు. ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారని… సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు.. బొగ్గు గనులు ప్రజల ఆత్మ అని వెల్లడించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. Bhatti Vikramarka
Bhatti Vikramarka slams abn tv owner
ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం.. నా పని అని వివరించారు. ఆస్తులను సంపాదించడం కోసం.. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం అని వివరించారు. సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాననని తెలిపారు. ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చానని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. Bhatti Vikramarka
Also Read: TDP: మరో వివాదంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ.. సంస్థ బోర్డు.. టెండర్ల నిబంధనలను చేసేది సంస్థ.. మంత్రి కాదని క్లారిటీ ఇచ్చారు. నేను రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిని అని… రాజశేఖర్ రెడ్డి మీద కోపంతో నా మీద రాసుండొచ్చు అంటూ నిప్పులు చెరిగారు. నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం.. ప్రజలకు నిజానిజాలు తెలియాలన్నారు. మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు.. మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దని ఫైర్ అయ్యారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వ్యక్తుల వ్యక్తిగత విషయాల జోలికి ఎవరు వెళ్లొద్దు.. ఎవరి గురించి నీచ నికృష్ట పనులు చేయించే వీక్ క్యారెక్టర్ కాదు నాదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. Bhatti Vikramarka
Also Read: AIADMK: పురుషులకు సైతం ఫ్రీ బస్..మేనిఫెస్టో విడుదల చేసిన ఏఐడీఎంకే పార్టీ


















