CM CHANDRABABU : సొంత కూట‌మిలో బీజేపీ ప్లాన్.. షిండే, నితీశ్.. నెక్ట్స్ చంద్ర‌బాబేనా..?

CM CHANDRABABU : బీహార్ లో చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు దేశ రాజ‌కీయాల్లో మ‌రింత ఆస‌క్తి రేపుతున్నాయి. నితీశ్ కుమార్ సీఎం ప‌ద‌వీ నుంచి త‌ప్పుకొని రాజ్య‌స‌భ‌కు వెళ్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌కటించ‌డం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు బీహార్ రాజ‌కీయాల‌ను శాసించిన నితీశ్ కుమార్.. సీఎం ప‌ద‌వీ వ‌దులుకొని రాజ్య‌స‌భ బాట ప‌ట్ట‌డం రాజ‌కీయ వ‌ర్గాలంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. ప్ర‌ధానంగా మెజార్టీ స్థానాలు క‌లిగి ఉన్న జేడీయూ స్థానంలో బీజేపీ నేత బీహార్ కి సీఎం కాబోతున్నార‌ని.. ఇందుకు నితీశ్ కుమార్ స‌హ‌క‌రిస్తున్నార‌నే చ‌ర్చ జోరుగా న‌డుస్తోంది.

BJP PLAN IN OWN ALLIANCE SHINDE, NITISH, NEXT IS CHANDRABABU

ప‌దోసారి సీఎంగా 2025 న‌వంబ‌ర్ లో నితిశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ ఎన్నిక‌లో నితిశ్ కుమార్ సీఎం అభ్య‌ర్థిగానే ఎన్డీయే కూట‌మి బ‌రిలోకి దిగింది. దీంతో తిరుగులేని విజ‌యం సాధించింది కూట‌మి. అయితే తాజాగా సీఎం ప‌ద‌వీ వ‌దులుకొని రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌బోతుండ‌టం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వాస్త‌వానికి నితిశ్ కుమార్ కి జాతీయ రాజకీయాలు కొత్తేమి కాదు.. గ‌తంలో కూడా ఆయ‌న కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన అనుభ‌వం ఉంది.

Also Read : TTD CHAIRMAN : టీటీడీ చైర్మ‌న్ గా ఏబీఎన్ రాధాకృష్ణ‌న్..?

గ‌తంలో మ‌హారాష్ట్ర‌లో ఏక్ నాథ్ షిండే ఉదాంతాన్ని ఎగ్జామ్ పుల్ చూపిస్తున్నారు. షిండే విష‌యంలో కూడా బీజేపీ ఇలాగే వ్య‌వ‌హ‌రించింద‌ని.. నితిశ్ విష‌యంలో అదే చేస్తుంద‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. బీహార్ సీఎంగా నితిశ్ కుమార్ వార‌సుడు ఎవ్వ‌రు అనే దానిపై ర‌క‌ర‌కాల పేర్లు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌద‌రి, కేంద్ర‌మంత్రి నిత్యానంద్ రాయ్, బీహార్ మంత్రి దిలీప్ కుమార్ జైస్వాల్ పేర్లు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఏక్ నాథ్ షిండే, నితిశ్ కుమార్ ప‌రిణామాల‌తో ఏపీ సీఎం చంద్ర‌బాబు విష‌యంలో కూడా సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జ‌రుగుతోంది. ఏపీలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ లేదా లోకేష్ ను సీఎం గా ప్ర‌పోజ్ చేస్తుంద‌నే ఊహ‌గానాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. టీడీపీ నేత‌లు మాత్రం ఖండిస్తుండ‌టం విశేషం.

Also Read : TELANGANA : తెలంగాణ కాంగ్రెస్ నుంచి రాజ్యసభ అభ్యర్థులు ఖ‌రారు..!