Chandrababu: పాల కల్తీపై సీఎం చంద్రబాబు ప్ర‌క‌ట‌న‌..మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు !

Chandrababu
Chandrababu

Chandrababu: రాజమండ్రి పాల కల్తీపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పూర్తిగా సహకారం అందిస్తామ‌ని సీఎం చంద్రబాబు నాయుడు వెల్ల‌డించారు. Chandrababu

Chief Minister Chandrababu made a statement in the Assembly regarding milk adulteration in Rajahmundry

ఎవరైనా కల్తీ చేస్తే ఉపేక్షించే పరిస్థితి లేదని వెల్ల‌డించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామ‌ని ప్ర‌క‌టించారు సీఎం చంద్రబాబు నాయుడు. అటు రాజమండ్రి పాల కల్తీ పై అసెంబ్లీలో వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్ ప్రకటన చేశారు. ప్రాథమిక పరీక్షల్లో యూరియా, సీరం క్రియేటిన్ స్థాయిలు పెరిగాయని తెలిపారు. Chandrababu

Also Read: Gandhi Bhavan: గాంధీ భవన్ ముట్టడి: బీజేపీ కార్యకర్తల అరెస్ట్.. హైదరాబాద్ లో టెన్షన్!!

వరలక్ష్మి మిల్క్ డైరీ నుంచి పాల సరఫరాను నిలిపి వేశామ‌న్నారు. మరణించిన వాళ్ళు 58 ఏళ్ల పైబడ్డ పెద్దవాళ్లుగా గుర్తించామ‌ని పేర్కొన్నారు. ఇద్దరు చిన్నారులు వెంటిలేటర్ పై ఉన్నారన్నారు. సహాయక చర్యల కోసం రాపిడ్ రెస్పాన్స్ టీమ్ ను ఏర్పాటు చేశానమ‌న్నారు వైద్య ఆరోగ్యశాఖా మంత్రి సత్యకుమార్. లక్షణాలు ఉన్న కుటుంబ సభ్యులను గుర్తించే ప్రక్రియతో పాటు వైద్య సేవలు అందిస్తున్నామ‌న్నారు. Chandrababu

Also Read: Chandrababu Naidu: దేశ ప్రతిష్టను దెబ్బతీసేలా కాంగ్రెస్ నిరసనలు.. చంద్రబాబు ఘాటు విమర్శలు

Share your love