CM Chandrababu: హైదరాబాద్ ను మించిన నగరం అమరావతి

Chandrababu
Chandrababu

CM Chandrababu: హైదరాబాద్ ను మించిన నగరం అమరావతి అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. సైబరాబాద్ నిర్మాణంతో తెలంగాణ తలసరి ఆదాయం దేశంలోనే నెంబర్ వన్ అయ్యిందన్నారు. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ అయితే అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ అని తెలిపారు సీఎం చంద్రబాబు. CM Chandrababu

Amaravati is a better city than Hyderabad said CM Chandrababu

ఇవాళ టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స‌వం సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు మాట్లాడారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకూ అన్నీ సంచలనమే అన్నారు సీఎం చంద్రబాబు. పార్టీ పెట్టిన 9 నెలలోనే అధికారంలోకి రావడం ఓ ప్రపంచ రికార్డు అంటూ వ్యాఖ్యానించారు. ఇదీ తెలుగుదేశం పార్టీ సత్తా, జెండా పవర్, సైకిల్ స్పీడ్ అని వివ‌రించారు సీఎం చంద్రబాబు. CM Chandrababu

Also Read: Cm Revanth Reddy: మూసీ ప్రక్షాళనను అడ్డుకునే వారి మీద శివతాండవం చేస్తా

ఇక మూడు ముక్కలాట ఉండదు.. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అని ప్ర‌క‌టించారు. రాబోయే రోజుల్లో అమరావతిని ఇంచు కూడా కదిలించలేరని సీరియ‌స్ అయ్యారు. ప్రజా రాజధాని, దేవతల రాజధాని అమరావతి పేరు చెబితే కొందరికి శాశ్వతంగా నిద్ర రాదన్నారు. అమరావతి వ్యతిరేక శక్తులు రాజధానిలో అడుగుపెట్టకుండా చేసే బాధ్యత అందరిపై ఉందని వ్యాఖ్యానించారు చంద్ర‌బాబు. CM Chandrababu

Also Read: Marriage To Idols: చనిపోయిన ప్రేమికుల‌కు పెళ్లి..చ‌రిత్ర‌లోనే తొలిసారి

Share your love