TELANGANA : ఎమ్మెల్యేలు దానం, క‌డియంల‌కు ఊర‌ట‌.. అన‌ర్హ‌త పిటిష‌న్ల‌ను కొట్టేసిన స్పీక‌ర్

DANAM, KADIYAM
DANAM, KADIYAM
DANAM, KADIYAM

TELANGANA : తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొన‌సాగుతున్న ఉత్కంఠకు నేటితో తెరపడింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిల పై దాఖలు అయిన‌ అనర్హత పిటిషన్ల పై స్పీకర్ ఇవాళ‌ తుది నిర్ణయాన్ని ప్రకటించారు. విచారణ అనంతరం కడియం, దానం నాగేందర్‌కు ఊరట లభించింది. ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేశారు. దానం, కడియంపై దాఖలపై అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో నిర్ణీత గడువు ముగుస్తుండటంతో స్పీకర్ కార్యాలయం ఈ మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.

MAL’S DANAM NAGENDER AND KADIAM SRIHARI SPEAKER WHO DISMISSED DISQUALIFICATION PETITIONS

మొత్తం పది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఎనిమిది మందికి స్పీకర్ క్లీన్‌చిట్ ఇచ్చారు. దానం, కడియంల పై తాజాగా వాదనలు పూర్తికాగా.. నిర్ణయాన్ని ప్రకటించారు. మొత్తం పది మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ లభించింది. సుప్రీంకోర్టు సూచనల ప్రకారం.. మార్చి 12తేదీ లోపు వీరిద్దరి విషయంలో స్పీకర్ నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉండగా.. ఒకరోజు ముందే.. కడియం, దానం నాగేందర్‌ పై దాఖలైన రెండు పిటిషన్లను డిస్మిస్ శారు స్పీకర్ గ‌డ్డం ప్ర‌సాద్.

ALSO READ : Fuel crisis : థాయ్ లాండ్ లో నాలుగు రోజులే ప‌ని దినాలు..వియ‌త్నాం వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్..!

స్పీకర్ తీర్పు వెలువ‌డించిన తర్వాత దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. వ్యక్తిగత నిర్ణయంతోనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినట్టు దానం నాగేందర్‌ పేర్కొన్నారు. తన ఫండమెంటల్ రైట్‌ను కాలరాసే హక్కు ఎవరికీ లేదన్నారు.

Also Read : TELANGANA : లోక్ సభలో తెలంగాణకు అవమానం

Share your love
పక్కా ఫిల్మీ లోగో

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_