
Ram Charan: మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం ఈయన పేరు ఇండస్ట్రీలో మార్మోగుతోంది.. 6 పదుల వయసులో కూడా ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అలాంటి మెగాస్టార్ నట వారసులుగా ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వచ్చారు. కానీ ఇందులో గ్లోబల్ స్టార్ గా మారింది మాత్రం తన ముద్దుల కొడుకు రామ్ చరణ్ మాత్రమే..
Ram Charan is going to become a father for the second time
ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన మైలురాయిని ఏర్పాటు చేసుకున్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకుంటున్నారు.. అలాంటి రామ్ చరణ్ సినీ ఇండస్ట్రీకి పెద్దగా పరిచయం లేనటువంటి ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లి జరిగి కొన్ని సంవత్సరాల తర్వాత క్లింకార అనే అమ్మాయి పుట్టింది.. దీంతో మెగా ఇంట్లో పండగ వాతావరణం ఏర్పడిందని చెప్పవచ్చు. (Ram Charan)
Also Read: Vadivelu: వడివేలు,కోవై సరళ రూమ్ లో గడియ పెట్టుకొని ఆ పని.. డైరెక్టర్ ఫైర్.!
క్లింకార పుట్టి రెండు సంవత్సరాలు గడిచింది. ఇప్పటికీ ఆ పాప మొహాన్ని బయట రివీల్ చేయలేదు. కట్ చేస్తే రామ్ చరణ్ మరోసారి తండ్రి కాబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఒక వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ను ఉపాసన గట్టిగా పట్టుకొని నెమ్మదిగా మెట్లు దిగుతోంది.

అంతేకాకుండా తన పొట్ట భాగంలో పూర్తిగా చున్నీనీ కప్పి తన కడుపు కనిపించకుండా కవర్ చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఉపాసన మరోసారి ప్రెగ్నెంట్ అయింది అంటూ వార్తలు ఉపందుకున్నాయి. మరి ఇందులో నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతుంది..(Ram Charan)





