e-Challan: వాహనాల చలాన్లపై సామాన్యులకు షాక్.. రేవంత్ షాకింగ్ నిర్ణయం ?

e-Challan
e-Challan
e-Challan

e-Challan: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర రాబడి పెంచేందుకుగాను అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు మిడిల్ క్లాస్ కుటుంబాలపై భారం పడేలా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ గా వాహనాల చలాన్లపై కీలక నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. e-Challan

Cm Revanth Reddy on Traffic Police e-Challan

వాహనం చలాన్ పడ్డ వెంటనే బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవ్వాలని తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. యజమాని వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి వచ్చినప్పుడే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా తీసుకోవాలని సూచనలు చేశారట. ఆ వివరాలు వెంటనే సింక్ చేయాలని… చలాన్ పడ్డ వెంటనే ఆటోమేటిక్గా డబ్బులు అకౌంట్ నుంచి కట్ కావాలని ఆదేశాలు ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. e-Challan

Also Read: Congress: 6 జిల్లాలను తిరిగి కలిపి ఉమ్మడి వరంగల్ జిల్లాగా చేయండి ?

అయితే సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అత్యధికంగా చలాన్లు వేస్తున్నారని కెసిఆర్ ప్రభుత్వం పై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేసిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు జనాలు. ఇలా బ్యాంక్ కౌంట్ నుంచి వెంటనే డబ్బులు కట్ కావడం దారుణం అంటూ ఫైర్ అవుతున్నారు. కెసిఆర్ ఉన్నప్పుడు చలాన్లపై డిస్కౌంట్ ఇచ్చేవాడని.. ఇప్పుడు అది కూడా లేదని చురకలు అంటిస్తున్నారు. మరి దీనిపై రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. e-Challan

Also Read: Sampath Kumar: 8 కోట్లు కమిషన్ ఇవ్వకుంటే చంపి పారేస్తాం..వివాదంలో కాంగ్రెస్ నేత ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu