ALLU ARAVIND : సీఎం రేవంత్ రెడ్డి వారానికి 14 రోజులు పని చేస్తుండు.. అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

cm revanth reddy
cm revanth reddy

ALLU ARAVIND : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పై ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కొకాపేట‌లోని ప్రారంభోత్సవం సంద‌ర్బంగా హాజ‌రైన సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆయ‌న నిరంత‌రం క‌ష్ట‌ప‌డుతున్నార‌ని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత క‌ష్ట‌మైన ప‌నిని అయినా చేస్తార‌ని కొనియాడారు.

Cm Revanth Reddy works 14 days a week.. Allu Aravind’s interesting comments

ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి వారానికి 14 రోజులు ప‌ని చేస్తారని పేర్కొన్నారు. హైద‌రాబాద్ ను ఫిల్మ్ క్యాపిట‌ల్ గా చేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని.. దానికి సినీ ఇండ‌స్ట్రీ తోడు ఉంటుంద‌ని తెలిపారు నిర్మాత అల్లు అర‌వింద్. ప్రపంచంలో ఉన్న మూడు థియేట‌ర్ల‌లో ఇది ఒక‌టి. ప్ర‌పంచంలోనే బిగ్గెస్ట్ డాల్బీ సినిమాలు ప్ర‌పంచంలో మూడు ఉన్నాయి. అందులో ఒక‌టి హైద‌రాబాద్ లో ఉంది.

Also Read : Telangana MLAs: 10 మంది ఎమ్మెల్యేలకు లైన్ క్లియర్.. ఊపిరి పీల్చుకున్న తెలంగాణ ప్రభుత్వం!!

ఇప్ప‌ట్లో ఇండియాలో ఇటువంటి థియేట‌ర్ ని పోల్చుకోగ‌లిగే థియేట‌ర్ ఇంకొక‌టి రావ‌డానికి కొన్ని సంవ‌త్స‌రాలు ప‌డుతుంది. ఈ సంద‌ర్భంగా తాను ముగ్గురిని త‌లుచుకోవాల‌న్నారు. వారిలో ముఖ్యంగా త‌న‌ను ఇండ‌స్ట్రీలోకి రావాల‌ని ప్రోత్స‌హించిన తండ్రి అల్లు రామ‌లింగ‌య్య‌, ఎంతో మందికి స్పూర్తిగా నిలిచే చిరంజీవి, ఈ సెక్టార్ మీద ఆస‌క్తి క‌లిగేవిధంగా చేసిన ఏషియన్ ఫిల్మ్ నారాయ‌ణ‌దాస్ ల‌కు ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముఖ్యంగా అల్లు అర‌వింద్ సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆస‌క్తిక‌ర వ్యాక్య‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి.

Also Read : Chandrababu: చంద్రబాబు సంచలన నిర్ణయం.. నలుగురు ఎమ్మెల్యేలపై వేటుకు రంగం సిద్ధం

Share your love