Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో జోనల్ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈ జోనల్ వ్యవస్థ ప్రకారం మూడు జోన్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించబోతున్నారు. విశాఖపట్నం అమరావతి రాయలసీమ ఇలా మూడు ప్రాంతాలుగా విభజించి పాలన కొనసాగించనున్నారు. Chandrababu

Chandrababu gives green signal to zonal system

మూడు జోన్లుగా వీటిని డివైడ్ చేశారు. ఒక్కో జోన్ కు సీనియర్ ఐఏఎస్ అధికారి సీఈవోగా నియమించగా, అతి త్వరలోనే అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ బోతున్నాయి. అంతేకాదు విశాఖ జోన్ కు యువరాజు, అమరావతి జోన్ కు మీనా అలాగే రాయలసీమకు కృష్ణ బాబు సీనియర్ ఐఏఎస్ అధికారులు పనిచేయబోతున్నారు. Chandrababu

Also Read: WPL 2026 Schedule: WPL 2026 షెడ్యూల్ వ‌చ్చేసింది..ఉచితంగా ఇలా చూడండి

అదే సమయంలో అమరావతి జోన్ పై ప్రత్యేక దృష్టి పెట్టనుంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం. త్వరితగతిన అమరావతి రాజధానిని పూర్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ జోన్ కు ఎక్కువగా నిధులు కూడా కేటాయించే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అమరావతి జోన్ పై సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ చేయబోతున్నారు. వారానికి ఒకసారి దీనిపై రివ్యూ కూడా నిర్వహించనున్నారు. Chandrababu

Also Read: KCR: వైసీపీ-BRS మధ్య రాజకీయ పొత్తు.. కేసీఆర్ 3.0 లోడింగ్?

Share your love