Roasted Corn: రోడ్డుపైన కాల్చే మొక్కజొన్న తింటున్నారా…అయితే ప్రమాదంలో పడ్డట్టే ?

Roasted Corn: మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి ఒక్కరూ ఇది తినడానికి ఎంతో ఇష్టపడతారు. చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు మొక్కజొన్నలు ఎంతో ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ప్రయాణ సమయాల్లో మొక్కజొన్న అధికంగా కొనుక్కొని తింటూ ఉంటారు. చిన్నపిల్లలు పెద్దవారు ప్రయాణ సమయంలో టైం పాస్ కోసం మొక్కజొన్నను ఎక్కువగా తింటారు. ఇది కడుపు నిండి ఆకలి అనిపించకుండా ఉంటుంది. అయితే మొక్కజొన్నను చాలా వరకు రోడ్లమీద ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. రోడ్లమీద కాల్చి అమ్ముతూ ఉంటారు. అయితే అలాంటి మొక్కజొన్నలు తినడం మంచిదేనా కాదా అని ఎవరు ఆలోచించరు. అయితే ఈ విషయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ రోడ్డుమీద కాల్చే మొక్కజొన్న అస్సలు మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. రోడ్డు మీద కాల్చే మొక్క జొన్నపై దుమ్ము ధూళి అధికంగా పడుతుంది. Roasted Corn

Road Side Roasted Corn Effect And Health Benefits

అలాంటి దానిని తినడం వల్ల కడుపులో కాస్త ఇబ్బంది ఏర్పడుతుందని వైద్యులు చెబుతున్నారు. కడుపునొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా రోడ్డుమీద కాల్చే మొక్కజొన్నను తినడం వల్ల అది జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆ లోపు కడుపునొప్పి, వాంతులు, వీరేచనాలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఆ కారణంగానే మొక్కజొన్నను రోడ్డుమీద అమ్ముతున్నప్పుడు తినకపోవడం మంచిదని చెబుతున్నారు. ప్రయాణ సమయంలో మనం వెళ్తున్నప్పుడు తినాలని అనిపించినప్పుడు మొక్కజొన్నను ఇంట్లో కాల్చుకొని తినాలని వైద్యులు చెబుతున్నారు. మొక్కజొన్న ఆరోగ్యానికి చాలా మంచిది. మొక్కజొన్నలో విటమిన్లు, ఫైబర్, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. Roasted Corn

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాతో విడాకులు తీసుకున్న‌ టాలీవుడ్ హీరోయిన్‌ రిలేషన్… త్వరలోనే వివాహం…!

వీటిని తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. మొక్కజొన్న తినడం వల్ల జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది. మలబద్ధకం లాంటి సమస్యలు తొలగిపోతాయి. మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మొక్కజొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి అనిపించదు. కడుపు నిండుగా ఉంటుంది దానివల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు. వేగంగా బరువు తగ్గడానికి మొక్కజొన్న అధికంగా సహాయం చేస్తుంది. ఇక చాలామంది మొక్కజొన్నను ఉడికించుకొని తింటారు. అది కూడా ఆరోగ్యానికి చాలా మంచి ఫలితాలను తీసుకువస్తుంది. డైట్ ఫాలో అయ్యేవారు మొక్కజొన్నను ఉడికించుకొని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల వేగంగా బరువు తగ్గడానికి మొక్కజొన్న అధికంగా సహాయం చేస్తుంది. Roasted Corn

Also Read: Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

Share your love