
Goa: గోవాలో ప్రస్తుతం పర్యాటకుల సందడి కనిపిస్తోంది. చలికాలం కావడంతో చాలామంది గోవాకు వెళ్తున్నారు. అక్కడ చిల్ అవుతున్నారు. అయితే ఇలాంటి నేపథ్యంలో గోవా వెళ్లే జంటలకు జాగ్రత్త అంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది. గోవాలో ప్రేమ జంట వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడట ఓ హోటల్ యజమాని. మరొకరితో పెళ్లయిందని, వదిలేయమని వేడుకున్న కూడా వినకుండా బెదిరింపులకు దిగాడట సదరు హోటల్ యజమాని. Goa
Couples going to Goa beware
దీంతో చేసేదేమీ లేక ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు చెబుతున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 35 ఏళ్లు ఉన్న ఓ మహిళ తన పెళ్లికి ముందు 2023 సంవత్సరంలో ఒక వ్యక్తితో గోవాకు వెళ్ళింది. అక్కడ బస చేసి ఫుల్ ఎంజాయ్ చేసింది ఆ లేడీ. యశ్వంత్ అనే 4 ఏళ్ల వ్యక్తితో ఆమె అక్కడ ఎంజాయ్ చేసింది. ఇటీవల ఆ మహిళకు ఫోన్ చేసి గతంలో మీరు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసానని, 30 లక్షలు ఇవ్వాలని యశ్వంత్ డిమాండ్ చేశాడు. Goa
Also Read: KCR: కేసీఆర్ ఒక్క కామెంట్…గులాబీ పార్టీకి ఆక్సిజన్, ఇక దూకుడే
తనకు ఇప్పుడు వేరే వ్యక్తితో పెళ్లయిందని, తన వైవాహిక జీవితం చెడిపోతుందని ఆమె ప్రాధేయపడిందట. అయినప్పటికీ హోటల్ యజమాని అస్సలు వినలేదని సమాచారం. దీంతో చేసేదేమీ లేక పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత మహిళ. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ హోటల్ యాజమాన్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై గోవాకు వెళ్లేవార్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచనలు చేస్తున్నారు. Goa
Also Read: IndiGo cancellations: కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడును అవమానించిన టీడీపీ ?





