Indigo Airlines: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దారుణం.. మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచార యత్నం!!

Cab driver attacked by Indigo staff

హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో Indigo Airlines కి చెందిన ఓ మహిళా ఉద్యోగిపై క్యాబ్ డ్రైవర్ దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. నిందితుడు ఆమెను అత్యాచారం చేయాలని ప్రయత్నించగా, ధైర్యంగా ప్రతిఘటించిన బాధితురాలు ప్రాణాలను కాపాడుకుంది. ఈ ఘటనతో విమానాశ్రయం సిబ్బందిలో తీవ్ర భయాందోళలు నెలకొన్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Indigo Airlines Cab Driver Attack

బాధిత మహిళ ఉద్యోగం కోసం రోజూ ఆ క్యాబ్‌నే ఉపయోగించేది. కానీ ఈసారి డ్రైవర్ తన ప్లాన్ ప్రకారం వాహనాన్ని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేశాడు. భయపడకుండా బాధితురాలు గట్టిగా అరిచి, పోరాడడంతో నిందితుడు పారిపోయాడు. వెంటనే ఆమె తోటి ఉద్యోగులకు ఫోన్ చేసి సమాచారం అందించింది. వారు కూడా ఆలస్యం చేయకుండా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విమానాశ్రయం లోని CCTV ఫుటేజీ ఆధారంగా నిందితుడి క్యాబ్ నంబరును గుర్తించడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. అతడి అరెస్ట్ కోసం ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ యాజమాన్యం కూడా ఈ విషయంలో సీరియస్‌గా స్పందించింది.

సంస్థ తరఫున బాధితురాలికి పూర్తి సహాయం అందిస్తామని ప్రకటించారు. అంతేకాకుండా, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ incident విమానాశ్రయంలోని ఇతర మహిళా ఉద్యోగులలో తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేపింది. ఇకనైనా విమానాశ్రయ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu