ఆకట్టుకుంటున్న “బాలన్” ఫస్ట్ లుక్ పోస్టర్

కన్నడ, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమల్లో భారీ చిత్రాలు నిర్మిస్తూ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ బ్యానర్ గా పేరు తెచ్చుకుంటోంది కేవీఎన్ ప్రొడక్షన్స్. ఈ సంస్త తెస్పియన్ ఫిలింస్ తో కలిసి నిర్మిస్తున్న మలయాళ మూవీ బాలన్. ఈ చిత్రానికి “ఆవేశం” ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో “మంజుమ్మెల్ బాయ్స్” చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

తాజాగా “బాలన్” సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఒక బాలుడు చేతిలో కర్రతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ తో డిజైన్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది. సినిమా ప్రారంభంతో పాటు రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టడం విశేషం. ఈ చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి కేవీఎన్ ప్రొడక్షన్స్ అడుగుపెడుతోంది.

Share your love