
TELANGANA : తెలంగాణకు మరోసారి లోక్ సభ సాక్షిగా అవమానం జరిగింది. ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఫిబ్రవరి 14, 2014ను బ్లాక్ డే గా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, తెలంగాణ బిల్లు 2014 ఫిబ్రవరిలో పార్లమెంటు ఆమోదం పొందిన రోజుపై నోటికి వచ్చినట్లు మాట్లాడారు టీడీపీ ఎంపీ కృష్ణదేవరాయలు. లోక్ సభ వేదికగా ప్రశ్నించే గొంతుక లేకపోవడంతో టీడీపీ ఎంపీ రెచ్చిపోయారు.
Disgrace to Telangana in Lok Sabha
తెలంగాణకు లోక్ సభలో అవమానం జరుగుతున్నా బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మాత్రం పట్టించుకోలేదు. కాంగ్రెస్ 8, బీజేపీ 8 మంది కలిపి మొత్తం 16 మంది ఎంపీలు ఉన్నా.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడటంలో మాత్రం పూర్తిగా విఫలం చెందారు. టీడీపీ ఎంపీ వ్యాఖ్యలను కనీసం ఏ ఒక్క ఎంపీ కూడా ఖండించలేదు.
Also Read : CM REVANTH REDDY : సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మున్సిపల్ కార్మికులు ఫైర్..!
లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును చీకటి రోజుగా అభివర్ణించిన ఏపీ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వ్యాఖ్యలు గర్హణీయమని బీఆర్ఎస్ నేతలు పేర్కొంటున్నారు. మహానేత కేసీఆర్ నాయకత్వంలో జరిగిన తెలంగాణ ఉద్యమం, యువత ఆత్మ త్యాగాలతో రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Also Read : KETHIREDDY VENKATARAMI REDDY : ఎవడిని వదిలేది లేదు.. అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కడికి నరకమే?




















