Dhoni: ధోనికి ఓ అన్న ఉన్నాడా.. కోట్ల ఆస్తులు ఉన్న ఈ క్రికెటర్ అన్నని పట్టించుకోడా.?

Does Dhoni have a brother
Does Dhoni have a brother

Dhoni: ఏంటి ధోనికి ఓ అన్న ఉన్నాడా..ఈ విషయం ఎవరికీ తెలియదే అనుకుంటారు అసలు విషయం తెలిస్తే.. అయితే ధోని కి సంబంధించి ధోని ది అన్ టోల్డ్ స్టోరీ అనే సినిమాలో కూడా ధోని అన్నయ్యని చూపించలేదు.అయితే అసలు నిజం ఏంటంటే.. ధోనీకి నరేంద్ర సింగ్ అనే అన్నయ్య ఉన్నారట.ఇక ఈ సినిమాలో ధోనీకి సిస్టర్ ఉన్నట్లు చూపించారు కానీ అన్నయ్య ఉన్నట్టు చూపించలేదు.

Does Dhoni have a brother

ఇక క్రికెట్లో సక్సెస్ అయ్యి ప్రపంచం మెచ్చిన క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న ధోని వందల కోట్ల ఆస్తులు సంపాదించి లగ్జరీ లైఫ్ ని అనుభవిస్తూ ఉంటే ధోని అన్నయ్య నరేంద్ర సింగ్ మాత్రం ఇప్పటికీ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారట నరేంద్ర సింగ్.అయితే మొదట నరేంద్ర సింగ్ సమాజ్వాది పార్టీలో చేరినప్పటికీ ఆయన ఎమ్మెల్యేగా గెలవలేదు.ఇక అన్న ఎమ్మెల్యే అవ్వాలని ప్రచారానికి ధోని రాలేదు.. ధోని ప్రచారం చేయాలని నరేంద్ర సింగ్ కూడా ఆహ్వానించలేదట. (Dhoni)

Also Read: MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంస‌న్‌?

అయితే ధోనీకి 1500 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఆయన అన్న మాత్రం రోజు కూలిగా బతుకు సాగిస్తున్నాడని ఓ రూమర్ రావడంతో దీని గురించి తాజాగా స్పందించారు నరేంద్ర సింగ్.. ఆయన మాట్లాడుతూ నేను కూలీ కాదని, ఓ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నానని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు ధోనీకి సంబంధించిన బయోపిక్ లో తనని చూపించకపోవడానికి కారణం కూడా చెబుతూ.. నేను ధోని కంటే 10 ఏళ్ళు పెద్ద వాడిని.

Does Dhoni have a brother

వాడి సక్సెస్ లో నేను కూడా చేయూత అందించాను. కానీ వాడు బ్యాట్ పట్టే టైం కి నేను అక్కడ లేను.పరోక్షంగా చేయూత అందించినప్పటికీ వాడి దగ్గర నేను లేను. అలాగే ఈ సినిమాలో నా పాత్ర పెట్టడం కష్టంగా మారిందని డైరెక్టర్ చెప్పాడు.అలా మూవీలో నా రోల్ లేదు. మూవీలో నా రోల్ పెట్టకపోయినా నేనేమీ బాధపడడం లేదు అంటూ నరేంద్ర సింగ్ క్లారిటీ ఇచ్చారు.(Dhoni)

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu

PakkaFilmy Telugu తెలుగు రాష్ట్రాల్లో సినిమా, రాజకీయాలు మరియు ట్రెండింగ్ వార్తలను అందించే ఒక డిజిటల్ న్యూస్ డెస్క్. మా ఎడిటోరియల్ టీమ్ ప్రతిరోజూ అందుబాటులో ఉన్న సోర్సుల నుండి సమాచారాన్ని సేకరించి, తెలుగు పాఠకుల కోసం సులభమైన భాషలో వార్తలుగా అందిస్తుంది. మమ్మల్ని ఇక్కడ కూడా ఫాలో అవ్వండి — X (Twitter): https://x.com/pakkafilmy007 | Telegram: https://t.me/pakkafilmytelugu | Instagram: https://instagram.com/pakkafilmy_