
Dharmendra: హీ మ్యాన్ ధర్మేంద్ర మరణంతో బాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన మరణ వార్త వినగానే ఎంతోమంది ఈయనతో కలిసి నటించిన నటీనటులు, సన్నిహితులు,కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా స్మశాన వాటికకి చేరుకొని చివరి చూపు చూశారు. అలా అశ్రునయనాల మధ్య ధర్మేంద్ర అంత్య క్రియలు ముగిశాయి. ఇదిలా ఉంటే తాజాగా ధర్మేంద్ర ఆస్తి గురించి ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది.
Hema Malini did not even get a penny from Dharmendra property
అదేంటంటే ధర్మేంద్రకి ఇద్దరు భార్యలు. కానీ ఆయన ఆస్తిలో చిల్లిగవ్వ కూడా రెండో భార్యకు రాదట.అదేలాగో ఇప్పుడు చూద్దాం. ధర్మేంద్ర కి ఇద్దరు భార్యలు ఉన్న సంగతి తెలిసిందే.కానీ మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండానే రెండో భార్యని పెళ్లి చేసుకున్నాడు.అలా హిందూ ధర్మం ప్రకారం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకోరాదు. (Dharmendra)
Also Read: Dharmendra: ధర్మేంద్ర అంత్యక్రియలపై కొత్త అనుమానం.. ఏం జరుగుతుంది.?
కానీ మొదటి భార్యకు విడాకులు ఇవ్వడం ఇష్టం లేక ఆయన ముస్లిం మతంలోకి మారి హేమమాలినిని పెళ్లాడారు.కానీ భారతీయ న్యాయ వ్యవస్థ ప్రకారం ధర్మేంద్రకు సంబంధించిన ఆస్తిలో ఎలాంటి హక్కు హేమమాలినికి లేదు.

కానీ హేమమాలినికి పుట్టిన పిల్లలకి మాత్రం ఆయన ఆస్తిలో హక్కు ఉంటుంది. ధర్మేంద్రకు సంబంధించిన పెన్షన్,ఆస్తి వీటన్నింటిలో ధర్మేంద్ర మొదటి భార్య ప్రకాష్ కౌర్ కి,ఆయన నలుగురు పిల్లలకు హక్కు ఉంటుంది.అలాగే హేమమాలినికి హక్కు లేకపోయినప్పటికీ ఆమె ఇద్దరి పిల్లలకు ఇందులో హక్కు ఉంటుంది.(Dharmendra)





