మనం ఈజీగా రిలేట్ చేసుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. అలాంటి కాన్సెప్ట్ తో తెరకెక్కిన మూవీ “లిటిల్ హార్ట్స్”. మౌళి తనూజ్, శివానీ నాగరం జంటగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్స్ లోకి రాబోతోంది. ఈ రోజు “లిటిల్ హార్ట్స్” సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ తో క్లారిటీ ఇచ్చారు. చదువురాని ఓ జంట మధ్య ప్రేమ మొదలైతే ఎలా ఉంటుందో హిలేరియస్ గా చూపించారు.
“లిటిల్ హార్ట్స్” ట్రైలర్ ఎలా ఉందో చూస్తే – అక్షరం ముక్క రాని ఇంటర్ స్టూడెంట్ అఖిల్ (మౌళి తనూజ్), అతను ఉండేది సైనిక్ పురిలో. అఖిల్ వేషాలు తండ్రి( రాజీవ్ కనకాల)కి చికాకు కలిగిస్తాయి. అండర్ వేర్ తో సహా నేను కొనిస్తే, కంప్యూటర్ వాల్ పేపర్ మాత్రం నాగార్జునది పెట్టుకుంటావా అని అఖిల్ ను అంటాడీ ఫ్రస్టేటెడ్ ఫాదర్. కొడుకు మీద ఖర్చు పెట్టిన ప్రతీది నాకు బొక్కే అనేది ఆయన నమ్మకం. వాయుపురిలో ఉండే కాత్యాయనిదీ సేమ్ క్యారెక్టర్. సుద్దమొద్దు అయిన కాత్యాయని కూడా తండ్రి ఏ విషయంలోనూ గర్వపడకుండా చేస్తుంది. బిలో యావరేజ్ అమ్మాయి కాత్యాయని అఖిల్ కంటికి బాలీవుడ్ హీరోయిన్ లా కనిపిస్తుంది. ఈ ఇద్దరు చదువురాని వాళ్లు ఒక టైమ్ లో ప్రేమలో పడతారు. కాత్యాయని ఫ్యామిలీ బెంగుళూరు షిఫ్ట్ కావాలని డిసైడ్ కావడం ఈ ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మూవీలో చూడాలి. థియేటర్స్ లో సినిమా చూడాలనే క్యూరియాసిటీ ట్రైలర్ క్రియేట్ చేసింది.





