FIFA 2026: డీకే శివకుమార్ కీలక ప్రకటన.. FIFA ఫ్యాన్స్ కోసం బెంగళూరు హోటళ్లు ఓపెన్!!

FIFA 2026 ప్రపంచ కప్ ఫైనల్స్ సమీపిస్తుండడంతో, బెంగళూరు హోటళ్లకు రాత్రి అనుమతి లభించింది. కర్ణాటక ప్రభుత్వం ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కోసం ఒక కిల్లర్ నిర్ణయం తీసుకుంది. NBA, FIFA మ్యాచ్‌ల లైవ్ స్క్రీనింగ్ కోసం బెంగళూరులోని హోటళ్ళు, రెస్టారెంట్లకు రాత్రి పూట టైం పొడిగించేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ శుభవార్తను డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు.

FIFA 2026 Late Night Hotel Allowance

ఈ స్పెషల్ పర్మిషన్ ప్రకారం, సెమీ ఫైనల్స్ జూలై 15, 16 తేదీల్లో, గ్రాండ్ ఫైనల్ జూలై 20న బెంగళూరు హోటళ్లు అర్ధరాత్రి దాటినా సర్వీస్ ఇవ్వొచ్చు. ముఖ్యంగా రాత్రి 1:00 AM నుండి తెల్లవారు జామున 3:30 AM వరకు ఫుడ్ సర్వీసెస్ అనుమతించారు. NRAI (నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా) చేసిన అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫ్యాన్స్ ఇప్పుడు హోటళ్లలో కూర్చుని టీవీలో మ్యాచ్ చూస్తూ బిర్యానీ, చికెన్ ఫ్రై లాంటి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు.

డీకే శివకుమార్ మాట్లాడుతూ, ఫుట్‌బాల్ ఫ్యాన్స్ బాధ్యతగా ప్రవర్తించాలని, శాంతిభద్రతలు కాపాడాలని అన్నారు. పోలీసులకు సహకరించాలని, నగరంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని కోరారు. అయితే ఈ వినోదం వల్ల పబ్లిక్‌కు డిస్టర్బెన్స్ లేదా సేఫ్టీ ఇష్యూ రాకూడదనేదే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. ఇది ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కు గొప్ప అవకాశం అని, కానీ ప్రతి ఒక్కరూ రూల్స్ ఫాలో అవ్వాలని ఆయన చెప్పారు.

ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత బెంగళూరులో హోటళ్లు, రెస్టారెంట్లు ఫిఫా స్పెషల్ ఈవెంట్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాయి. పెద్ద స్క్రీన్స్, స్పెషల్ మెనూస్ రెడీ చేస్తున్నాయి. FIFA 2026 ప్రపంచ కప్ ఫైనల్స్ టైమ్‌లో ఇది ఫ్యాన్స్ కు ఒక గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి తీసుకున్న స్టెప్. ఇప్పుడు అభిమానులు స్నేహితులతో కలిసి హోటల్‌లో కూర్చుని లైవ్‌గా మ్యాచ్ చూడొచ్చు.

అదే వెబ్ సైట్ లోని ఇతర ఆర్టికల్స్:
బెంగళూరు ట్రాఫిక్‌లో కొత్త నిబంధనలు – ప్రజలకు ఏం చెప్పారు?
కర్ణాటకలో ఉచిత విద్యుత్ స్కీమ్ – ఎవరికి అర్హత?
FIFA 2026 ఫైనల్స్ లైవ్ స్క్రీనింగ్ స్పాట్స్ లిస్ట్
బెంగళూరు నైట్ లైఫ్ లో మార్పులు – కొత్త నిబంధనల వివరాలు

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu