
Virat Kohli: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విరాట్ కోహ్లీ తన సొంతంగా ముంబైలో ఓ లగ్జరీ రెస్టారెంట్ ను నడిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెస్టారెంట్ ను ముంబైతో పాటు పలు నగరాలలో దేశవ్యాప్తంగా బ్రాంచ్ లను ప్రారంభించాడు. విరాట్ కోహ్లీ నిర్వహిస్తున్న లగ్జరీ రెస్టారెంట్ చైన్ వన్ commune రెస్టారెంట్ ముంబైలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ రెస్టారెంట్ ను లెజెండరీ సింగర్ కిషోర్ కుమార్ భవనంలో ఏర్పాటు చేశారు. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంటాయి. Virat Kohli
Virat Kohli restaurant prices are a topic of discussion on social media
స్పెషల్ డిషెస్ తో సహా అన్ని రకాల స్పెషల్ ఐటమ్స్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో లభిస్తాయి. చాలామంది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో భోజనం చేయడానికి ఆసక్తి చూపిస్తారు. కానీ అందులో ధరలను చూసి భయపడిపోతారు. అయితే విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో వంటకాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో ఉన్న మెనూ ధరలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అందులో స్టీమ్ రైస్ ధర 318 రూపాయలుగా ఉంది. సాల్టెడ్ ప్రైస్ ధర 348 రూపాయలు తందూరి రోటి మరియు బటర్ నాన్ ధర 118 రూపాయలు. ఈ ధరలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. Virat Kohli
Also Read: Shreyas Iyer: క్రిటికల్ గా శ్రేయాస్ అయ్యర్ కండిషన్..BCCI సంచలన నిర్ణయం
ఇంత సాధారణమైన ఆహారానికి ఇంత ఖరీదు ఎందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కొంతమంది విరాట్ కోహ్లీ రెస్టారెంట్ లో లగ్జరీ ఉంటుంది కాబట్టి ఆ మాత్రం రేట్లు ఉంటాయని అంటున్నారు. కేవలం భోజనం కోసం మాత్రమే కాకుండా లగ్జరీ అంబియన్స్, లొకేషన్ కు కలిపి ఇంత ధరలు అంటున్నారు. విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువకు ఆమాత్రం ధరలు ఉండాల్సిందేనని కోహ్లీ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇక మరి కొంతమంది సాధారణ ప్రజలు ఈ హోటల్ కి వెళ్తే ఇంత ధరలు పెట్టి భోజనం ఎలా చేస్తారు అని ఫైర్ అవుతున్నారు. మధ్యతరగతి ప్రజలకు కూడా అందుబాటులో ఉండే విధంగా భోజన సదుపాయం ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. Virat Kohli
Also Read: Nara Dishti: రోడ్డుపై పడేసిన నిమ్మకాయలను తొక్కితే ఏం జరుగుతుందో తెలుసా…?




















