
Geyser: చలికాలంలో చాలామంది గీజర్ కొనుగోలు చేస్తారు. వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటారు. గ్యాస్ స్టవ్ మీద కట్టెల పొయ్యి మీద హీటర్ మీద నీరు చాలా ఆలస్యంగా వేడి అవుతాయి. దాంతో చాలామంది సులభంగా తొందరగా పని అయిపోతుందని గీజర్ కొనుగోలు చేస్తారు. ఇది కేవలం స్విచ్ వేస్తే చాలు వేడి నీళ్లు వచ్చేస్తాయి. చాలామంది ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే హీటర్ మీద నీళ్లు పెట్టుకోవడానికి భయపడుతూ ఉంటారు. చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే తప్పకుండా గీజర్ ఉండాల్సిందే. అది బాత్రూంలో సెట్ చేసుకుంటే సరిపోతుంది. హీటర్ అయితే చాలామంది చిన్నపిల్లలు దానిని పట్టుకుంటారు. Geyser
gas geyser benefits
కొన్ని సందర్భాలలో ప్రాణానికే ప్రమాదం వాటిల్లుతుంది. అయితే ఆ కారణంతోనే చాలామంది గీజర్ కొనుగోలు చేస్తారు. అయితే గీజర్ కొనుగోలు చేసే సమయంలో తర్మోస్టాల్, ఆటో కట్ ఆఫ్ లాంటి భద్రత ఫీచర్లను ఎంచుకోవాలి. ఎనర్జీ స్టార్ రేటింగ్ తప్పకుండా ఉండాలి. వ్యాటేజ్ కూడా తప్పనిసరిగా ఉండే విధంగా చూసుకోవాలి. వేడి నీటి అవసరం, విద్యుత్ వినియోగం మధ్య సమతౌల్యం ఉన్నటువంటి మోడల్ ఎంచుకొని గీజర్ ను కొనుగోలు చేయాలి. ఇంట్లో కుటుంబ సభ్యులు ఎక్కువగా ఉన్నట్లయితే 25 నుంచి 35 లీటర్ల మధ్య సామర్థ్యం కలిగిన గీజర్ ను కొనుగోలు చేయాలి. Geyser
Also Read: MS DHONI: ధోని ఔట్.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా సంజు శాంసన్?
ఇంట్లో తక్కువ మంది ఉన్నట్లయితే 15 నుంచి 20 లీటర్ల సామర్థ్యం కలిగిన గీజర్ ను పెట్టుకోవాలి. కేవలం ఇంట్లో నలుగురు లేదా ఐదు మంది సభ్యులు ఉన్నట్లయితే వారు 10 లీటర్ల గీజర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉన్నట్లయితే ఐదు లీటర్లు లేదా ఏడు లీటర్ల సామర్ధ్యం కలిగిన గీజర్ కొనుగోలు చేయాలి. ఇక గీజర్ నీటితో స్నానం చేసే సమయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి. తడి చేతితో గీజర్ ను అసలు ముట్టుకోకూడదు. గీజర్ ఆన్ చేసి షవర్ నీటితో నేరుగా స్నానం చేయకూడదు. గీజర్ నీటిని బకెట్ లో పట్టుకొని మాత్రమే స్నానం చేయాలి స్నానం చేసే సమయంలో కూడా గీజర్ అసలు ఆన్ ఉండకూడదు గీజర్ ఆఫ్ చేసిన తర్వాతనే స్నానం చేయాలి. ఈ నియమాలు పాటించినట్లయితే చలికాలంలో గీజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. Geyser
Also Read: KCR: జూబ్లీహిల్స్ లో దారుణ ఓటమి.. KCR సంచలన నిర్ణయం ?

