Kushboo Patani: హిందువులను అవమానించిన దిశా పటాని సోదరికి చుక్కలు.. ఏకంగా గన్ తో కాల్పులు .!

Kushboo Patani who insulted Hindus

Kushboo Patani: బాలీవుడ్ నటి దిశపటాని ఇంటిపై శుక్రవారం రోజు కాల్పులు జరిగినా సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే దిశా పటాని సోదరి కుష్బూ పటాని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆమె మాటలు విన్న సనాతన ధర్మాన్ని ఆచరించేవాళ్లు ఏకంగా గన్ లతో కాల్పులు జరిపారు.

Kushboo Patani who insulted Hindus

అయితే ఈ కాల్పుల్లో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినప్పటికీ ఓ వర్గం వాళ్లు మాత్రం దిశా పటాని సోదరి కుష్బూ పటానీ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇంకొకసారి చేస్తే బాగుండదని చిత్ర పరిశ్రమకు ఇది మేము హెచ్చరిక లాగా చెబుతున్నామని వార్నింగ్ ఇస్తూ ఈ విషయాన్ని బయటపెట్టారు.(Kushboo Patani)

Also Read: Trivikram new film: త్రివిక్రమ్ ప్లాన్ అదుర్స్.. తారక్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్!!

అయితే రీసెంట్ గా కుష్బూ పటాని అనిరుద్ధా చార్యా జీ మహారాజ్ మహిళలపై చేసిన వ్యాఖ్యలపై మండి పడింది. మత గురువులు అలాంటి సమావేశంలో మహిళ గురించి మాట్లాడడం తగదు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ఆయన నా ముందు ఉంటే వదిలిపెట్టే దాన్ని కాదని అతను దేశ వ్యతిరేకి అంటూ సంచలన వీడియో పోస్ట్ చేసింది.

Kushboo Patani who insulted Hindus

అయితే ఈ వీడియో పై సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళు అనిరుద్ధచార్య జీ భక్తులు మండిపడి దిశపటాని ఇంటిపై కాల్పులు జరిపారు. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే బాగుండదని వార్నింగ్ ఇచ్చారు.(Kushboo Patani)

Share your love