Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారు

Kalvakuntla Kavitha: BRS నేత‌లు నాతో ట‌చ్ లో ఉన్నారని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కల్వకుంట్ల కవిత. ఇవాళ మీడియాతో చిట్ చాట్ లో కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కొత్త పార్టీ పెట్టాలా లేదా అనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఈ సంద‌ర్భంగా పేర్కొన్నారు. పార్టీ పెట్టేముందు కేసీఆర్ వందల మందితో చర్చలు జరిపారన్నారు కల్వకుంట్ల కవిత. Kalvakuntla Kavitha

Kalvakuntla Kavitha comments on BRS party

ప్రస్తుతం నేనూ అదే చేస్తున్నానని… తండ్రి పార్టీ నుంచి సస్పెండ్ అయి‌న మెదటి కూతుర్ని నేనే అంటూ వ్యాఖ్యానించారు కల్వకుంట్ల కవిత. ఇరిగేషన్ శాఖ విషయంలో 2016లోనే కేటీఆర్ ను అలర్ట్ చేశానని తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రతి నిర్ణయం కేసీఆర్ దేనని హరీష్ రావు పీసీ ఘోష్ కమిషన్ కు చెప్పారన్నారు కల్వకుంట్ల కవిత. Kalvakuntla Kavitha

Also Read: Break Fast: బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా…అయితే ప్ర‌మాదం తెచ్చుకున్న‌ట్లే?

హరీష్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప నాకు వేరే కోపం లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరే ఆలోచన నాకు లేదని స్ప‌ష్టం చేశారు. సీఎం రేవంత్ పదే పదే నాపేరు ఎందుకు తీసుకుంటున్నారో తెలియదన్నారు కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు పంపించడంపై స్పందించిన కవిత…. బీసీల పక్షాన మాట్లాడే ఎన్ని గొంతుకలు వచ్చినా స్వాగతిస్తామ‌న్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కల్వకుంట్ల కవిత వెల్ల‌డించారు.

Also Read: Ponguleti Srinivas: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ బయోపిక్.. హీరో ఎవరంటే?