విశాల్, సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్

కోలీవుడ్ హీరో విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారు. వీరి నిశ్చితార్థం ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గత కొద్దికాలంగా విశాల్, సాయి ధన్సిక రిలేషన్ లో ఉన్నారు. తాము పెళ్లి చేసుకోబోతున్నట్లు గతంలో వెల్లడించారు. ఈ రోజు కుటుంబ సభ్యుల సమక్షంలో విశాల్, సాయి ధన్సిక నిశ్చితార్థం జరిగింది.

ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ విశాల్ అందరి బ్లెస్సింగ్స్ కావాలని కోరారు. త్వరలోనే వీరి వివాహం జరగనుంది. ఈ జంటకు సినీ పరిశ్రమలోని పలువురు తమ బెస్ట్ విశెస్ అందిస్తున్నారు. ఇటీవల విశాల్ అనారోగ్యంతో కనిపించడం సంచలనమైంది. ఆయన నడవలేని పరిస్థితిలో కనిపించారు. అయితే జ్వరంతో వచ్చిన బలహీనత వల్లే విశాల్ అంత వీక్ గా కనిపించారని అతని టీమ్ తెలిపింది. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నారు విశాల్.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu