OG movie remuneration: ఓజీ మూవీ కోసం పవన్ కళ్యాణ్ పారితోషికం ఎన్ని వందల కొట్లో తెలుసా?

Pawan Kalyan OG movie remuneration details

OG movie remuneration: పవర్ స్టార్ Pawan Kalyan నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా OG (Ojas Gambhira) ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ సినిమా నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తీసుకున్న remuneration details ఇంటర్నెట్‌లో లీక్ కావడంతో టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. లీక్ అవుతున్న పోస్టుల ప్రకారం పవన్ కళ్యాణ్ ఏకంగా రూ.80 కోట్ల పారితోషికం తీసుకున్నారని సమాచారం. గతంలో వచ్చిన రూ.100 కోట్ల టాక్ తో పోలిస్తే ఇది కొంత తక్కువగానే ఉన్నప్పటికీ, ఇది పవన్ కెరీర్ లో భారీ రెమ్యునరేషన్ గా నిలుస్తోంది.

Pawan Kalyan OG movie remuneration details

వైరల్ అవుతున్న ఈ సమాచారం ప్రకారం OG మూవీ villain గా నటించిన బాలీవుడ్ స్టార్ Emraan Hashmi కు రూ.5 కోట్లు, దర్శకుడు Sujeeth కు రూ.8 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ Thaman కు రూ.5 కోట్లు, హీరోయిన్ Priyanka Mohan కు రూ.1.5 కోట్లు, అలాగే కీలక పాత్రలో నటించిన Shriya Reddy కి రూ.50 లక్షల పారితోషికం అందిందని టాక్ వినిపిస్తోంది.

DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై DVV Danayya భారీ budget తో నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై భారీ buzz క్రియేట్ చేస్తూ అభిమానుల్లో అంచనాలు పెంచాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు ‘A’ సర్టిఫికేట్ ఇచ్చింది.

ప్రస్తుతం ఓజీ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఈ క్రేజ్ చూస్తుంటే సినిమా బాక్సాఫీస్ వద్ద కొత్త records సృష్టించే అవకాశం ఉంది. అయితే నటీనటుల పారితోషికంపై అధికారిక announcement కోసం సినీప్రియులు ఇంకా వేచి చూస్తున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu