MLA ANIRUDH REDDY : తెలంగాణ‌లో మ‌ళ్లీ సారా దుకాణాలు తెర‌వాలి.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

MLA ANIRUDH REDDY
MLA ANIRUDH REDDY

MLA ANIRUDH REDDY : జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలిచారు. తాజాగా సచివాలయంలో మీడియాతో నిర్వ‌హించిన చిట్ చాట్ ఆయ‌న మాట్లాడారు. త్వ‌ర‌లో జ‌రుగ‌బోయే అసెంబ్లీ స‌మావేశాల్లో తాను బాంబు పేలుస్తానంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇక అదే స‌మ‌యంలో రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలన్నారు. గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాలు బతికేవారు, కానీ ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారని పేర్కొన్నారు.

JADCHERLA MLA ANIRUDH REDDY COMMENTS ON SARAH SHOPS SHOULD RE OPEN

సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారో అర్థం కావడం లేద‌న్నారు. అసెంబ్లీ సమావేశాల్లో సారా మ‌ళ్లీ ప్ర‌వేశపెట్టాల‌నే అంశంపై ప్రస్తావించి.. సారా దుకాణాలు మళ్లీ తెరవాలని రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వాన్ని అడుగుతాన‌ని చెప్పారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి. సారా అనేది ఆరోగ్యానికి హానిక‌రం కాద‌ని.. శాస్త్రీయ ప‌ద్ద‌తులు చెబుతున్నాయ‌ని పేర్కొన్నారు.

Also Read : Vijaya Dairy: విజయ డెయిరీ బ్రాండ్ పేరుతో గుజరాత్‌ కల్తీ నెయ్యి!

తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో భాగంగా జీరో అవ‌ర్ లో సారా దుకాణాల‌ను తిరిగి ప్ర‌వేశ పెట్టాల‌నే అంశాన్ని లేవ‌నెత్తుతాన‌ని తెలిపారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఇటీవ‌లే సారా దుకాణాల‌ను ప్రారంభించారు. ఒడిశా, మ‌ధ్య ప్ర‌దేశ్ వంటి రాష్ట్రాల్లో అక్క‌డ ఉన్న ప్ర‌భుత్వాలే అధికారంగా సారా న‌డుపుతున్నాయని వెల్ల‌డించారు.

Also Read : Telangana: కరెంట్ కోత‌లు..ప‌క్క రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం?