Congress: జూబ్లీహిల్స్‌లో ఓటు వేయని వారు.. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే!?

Congress: తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ప్రచారం జోరుగా జరగగా, ఎన్నికల పోలింగ్ కూడా అడపాదడప గొడవల మధ్య నిర్వహించారు. ఇక రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు బయటపడనున్నాయి. శుక్రవారం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం వరకు ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. మెజారిటీ సర్వేలు గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇవ్వగా ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చాయి.Congress

Congress Those who didnt vote in Jubilee Hills must return their money

అయితే ఇలాంటి నేపథ్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో తమకు ఓటు వేయని వాళ్లు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ చోటా లీడర్లు వసూళ్లు చేస్తున్నారట. జూబ్లీహిల్స్‌లో ఓటు వేయని వారు.. డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేన‌ని, డబ్బులు తీసుకొని.. ఓటు వేయని వారిని గుర్తించే పనిలో నిమగ్నమైంద‌ట‌ కాంగ్రెస్ పార్టీ. Congress

Also Read: RCB: చిన్న‌స్వామిలో నో ఐపీఎల్..షాక్ లో బెంగ‌ళూరు ఫ్యాన్స్?

బస్తీలు, కాలనీల్లో ఓటర్ లిస్ట్ ఆధారంగా ఓటు వేయని వారిని గుర్తించే ప్రక్రియ షురూ అయిందట‌. ఒక ఇంట్లో 18 ఓట్లకు డబ్బులు తీసుకొని కేవలం నలుగురు మాత్రమే ఓటు వేశారని..అపార్ట్‌మెంట్‌లలో ఉండేవారు అసలు బయటకే రాలేదని గుర్తించారు కాంగ్రెస్ నేతలు. డబ్బు పంచిన వారిలో.. సగానికి పైగా మంది ఓటేయలేదని బూత్ ఏజెంట్లు గుర్తించారట‌. కాలనీ పెద్దలు, అపార్ట్‌మెంట్ వాసుల వద్దకు వెళ్లి.. డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నార‌ట‌ కాంగ్రెస్ బూత్ ఏజెంట్లు. ఈ మేర‌కు కాంగ్రెస్ డ‌బ్బులు వ‌సూళ్లు చేస్తోంద‌ని బీఆర్ఎస్‌ పార్టీ సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అవుతున్నాయి. Congress

Also Read: KCR: జూబ్లీహిల్స్ లో ఓడిపోతే, KCR ఫ్యామిలీ మొత్తం అరెస్ట్?

Share your love