Kalvakuntla Kavitha: తమిళనాడు జ్యోతిష్యుడితో రహస్య భేటీ!

Kalvakuntla Kavitha Target BJP Vote Bank

తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత గురించి ఇప్పుడు సరికొత్త చర్చ మొదలైంది. తమిళనాడుకు చెందిన ఫేమస్ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్‌తో ఆమె రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భేటీ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది అన్న వివరాలు బయటకు రాలేదు కానీ, ఈ మీటింగ్ గురించి పొలిటికల్ సర్కిల్స్‌లో భారీగా డిస్కషన్ జరుగుతోంది.

Kavitha Radhan Pandit Secret Meet

సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమె వ్యక్తిగత సమస్యల నిమిత్తం అస్ట్రాలజీ నిపుణుడిని సంప్రదించి ఉంటారని అంటుంటే, మరికొందరు మాత్రం రాబోయే ఎన్నికలు, పొలిటికల్ స్ట్రాటజీల గురించి మార్గదర్శకత్వం తీసుకున్నారని చెప్పుకుంటున్నారు. ఇలాంటి భేటీలు సాధారణంగా చాలా మంది పొలిటీషియన్స్ చేస్తుంటారు కాబట్టి దీన్ని ఎలా చూడాలన్నది మాత్రం డౌటే.

అయితే, ఇటీవల కాలంలో కవిత రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్న సమయంలో ఈ జ్యోతిష్యుడి భేటీ జరగడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జోతిష్యం, న్యూమరాలజీ లాంటి వాటిని నమ్ముతారా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై ఆమె క్యాంపు నుంచి ఎలాంటి అధికారిక స్పందన రాలేదు.

మొత్తానికి ఈ సీక్రెట్ మీటింగ్ గురించి మరిన్ని డిటైల్స్ తెలియాలంటే మరికొంత టైం పట్టవచ్చు. ఈ వ్యవహారం త్వరలోనే పెద్ద పొలిటికల్ డిబేట్‌గా మారే అవకాశం కూడా లేకపోలేదు. మరి ఆమె అభిమానులు, విమర్శకులు ఈ డెవలప్‌మెంట్‌ను ఎలా తీసుకుంటారో చూడాలి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu