Kavitha: సిద్దిపేట బ‌రిలో క‌ల్వ‌కుంట్ల క‌విత ?

Kalvakuntla kavitha in Siddipet Barilo

Kavitha: సిద్ధిపేట ఎమ్మెల్యే హ‌రీష్ రావుకు క‌ల్వ‌కుంట్ల క‌విత ఊహించని షాక్ ఇచ్చారు. సిద్ధిపేట‌లో బ‌రిలో నిలిచేందుకు క‌ల్వ‌కుంట్ల క‌విత ఉండే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. నిన్న బ‌తుక‌మ్మ పండుగ నేప‌థ్యంలో… కేసీఆర్ సొంతూరు చింత మ‌డ‌క‌లో ప‌ర్య‌టించారు క‌ల్వ‌కుంట్ల క‌విత. ఈ సంద‌ర్భంగా బతుక‌మ్మ ఆడారు.

Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

Kalvakuntla kavitha in Siddipet Barilo

అనంత‌రం క‌ల్వ‌కుంట్ల క‌విత స్పందించారు. త‌న తల్లిదండ్రులు బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబం నుంచి విడగొట్టే కుట్రలు చేసిన వాళ్లను విడిచిపెట్టను అంటూ హ‌రీష్ రావుకు ప‌రోక్షంగా వార్నింగ్ ఇచ్చారు కవిత. చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందనేది చూపిస్తాన‌ని హెచ్చ‌రించారు. ఏ ఊరూ ఏ అయ్యా జాగీరు కాదన్నారు. నా కుటుంబంపై కుట్రలు చేసిన వారి భరతం పడతాన‌ని హెచ్చ‌రించారు కవిత.

Also Read: India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

దీంతో సిద్దిపేట నుంచి వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌ల్వ‌కుంట్ల క‌విత పోటీ చేస్తార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. కుటుంబం నుంచి విడగొట్టే కుట్రలు చేసిన వాళ్లను విడిచిపెట్టను అంటూ క‌విత మాట్లాడ‌టం దానికి సంకేత‌మేన‌ని చెబుతున్నారు. సిద్ధిపేట‌లో హ‌రీష్ రావును నిజంగానే క‌విత ఓడిస్తే.. చ‌రిత్రే అవుతుంది.

Also Read: Bobbarlu: ఈ గింజలు పిడికెడు తిన్నారంటే 100 రోగాలకు చెక్…మటన్, చికెన్ కూడా పనిరాదు…

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu