

Kavitha: కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కొత్త పార్టీ పెట్టనున్నారట కల్వకుంట్ల కవిత. యువత కోసం కొత్త రాజకీయ వేదిక రాబోతోందంటూ హింట్ ఇచ్చారు కల్వకుంట్ల కవిత. ఖచ్చితంగా గొప్ప రాజకీయశక్తిగా ఎదుగుతానంటూ తాజాగా కల్వకుంట్ల కవిత వెల్లడించారు. Kavitha
Kalvakuntla Kavita going to form a new party
మీకోసం పనిచేయడానికి కొత్త రాజకీయ వేదిక రాబోతోందని వెల్లడించారు. దీవించండి.. ఆశీర్వదించండి..నాతో పాటు నడవండని కోరారు కవిత. ఎలాంటి నైతికత లేని బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వచ్చినందుకు సంతోషంగా ఉందని వివరించారు కవిత. Kavitha
Also Read: Revanth Reddy: రాయలసీమకు సీఎం చంద్రబాబు మరణ శాసనం ?
హరీష్ రావు లాంటి అవినీతి పరుల పేర్లు చెప్పగానే నన్ను సస్పెండ్ చేశారని తెలిపారు కల్వకుంట్ల కవిత. సస్పెండ్ చేసే ముందు కనీసం నా వివరణ కూడా అడగలేదని క్లారిటీ ఇచ్చారు. నన్ను బహిష్కరించే ముందు రాత్రికి రాత్రే క్రమశిక్షణా కమిటీ పుట్టుకొచ్చిందని ఫైర్ అయ్యారు. జాతీయ పార్టీగా ఎదగాలి అనుకున్న ఒక పార్టీని ఇలా నడపడం కరెక్ట్ కాదన్నారు కల్వకుంట్ల కవిత. Kavitha
Also Read: Gudem Mahipal Reddy: కేసీఆర్ మార్క్..బీఆర్ఎస్ పార్టీలోకి కాంగ్రెస్ ఎమ్మెల్యే ?







