KCR: దిగివచ్చిన గులాబీ బాస్… కల్వకుంట్ల కవితతో చర్చలు?

KCR meeting with kalvakuntla kavitha

KCR: కల్వకుంట్ల కవిత బెదిరింపులకు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దిగివచ్చినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిన్న చిన్న బతుకమ్మ పండుగ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేసీఆర్ సొంత గ్రామం చింతమడకలో కల్వకుంట్ల కవిత ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. తన కుటుంబం నుంచి తనను కొంతమంది కుట్రలు చేసి వెలివేసారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

KCR meeting with kalvakuntla kavitha

అలాగే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా కల్వకుంట్ల కవిత తరఫు వ్యక్తిని బరిలో దింపబోతున్నారట. ఓ ముస్లిం వ్యక్తిని.. తెలంగాణ జాగృతి నుంచి బరిలోకి దించేందుకు సిద్ధమవుతున్నారట. అయితే ప్రస్తుత పరిస్థితులలో కూతురుతో గొడవ పెట్టుకోవడం ఏమాత్రం సమంజసం కాదని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ మళ్లీ పుంజుకోవాలంటే కచ్చితంగా కవితను సైలెంట్ చేయాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట. ఇందులో భాగంగానే కల్వకుంట్ల కవితకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది కేసీఆర్.

Also Read: Bathukamma: తెలంగాణలో బతుకమ్మ పండుగ… తొమ్మిది రోజుల నైవేద్యాలు ఇవే..!

ఆమెను ఫామ్ హౌస్ కు రప్పించి ఆమెతో చర్చలు చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతానికి ఎలాంటి గొడవ పెట్టుకోకూడదని… ఓట్లు చీలిపోకుండా జాగ్రత్తలు పడాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారట. అందుకే తన కూతురిని దగ్గరికి తీసుకుంటున్నారట. మరి దీనిపై కల్వకుంట్ల కవిత ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Also Read: India vs Pakistan: ఇవాళ్టి టీమిండియాను బాయ్ కాట్ చేయనున్న పాకిస్థాన్ ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu