Kavitha: హరీశ్ రావు ఒక గుంటనక్క…క‌విత మ‌రో సంచ‌ల‌నం

Kavitha sensational comments on harish rao
Kavitha sensational comments on harish rao
Kavitha sensational comments on harish rao

Kavitha: హరీశ్ రావు ఒక గుంటనక్క అంటూ క‌ల్వ‌కుంట్ల క‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి హరీశ్ రావును విమర్శిస్తే అసెంబ్లీని బాయ్ కాట్ చేస్తారా ? అంటూ నిల‌దీశారు. కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు మాట్లాడాడు అప్పుడు ఎందుకు బహిష్కరించలేదు ? అని ప్ర‌శ్నించారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. Kavitha

Kavitha sensational comments on harish rao

ఈ గుంటనక్కను డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించినప్పుడే BRS‌ను ఎవరూ కాపాడలేరని ముందే చెప్పానన్నారు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఇక అటు బీఆర్ఎస్ పార్టీ మరో జల పోరాటానికి శ్రీకారం చుడ‌తామ‌ని..హ‌రీష్ రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్టీ మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతుంద‌ని వెల్ల‌డించారు. కృష్ణా నది జలాలపై తెలంగాణకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయంపై ప్రజా పోరాటం చేస్తామ‌ని వెల్ల‌డించారు. మీ మెడలు వంచుతాం.. తెలంగాణ హక్కులను కాపాడుతామ‌ని హరీశ్ రావ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. Kavitha

Also Read: Kavitha: కవిత వాహనాలపై భారీగా ట్రాఫిక్ చలాన్స్.. ఎన్నంటే?

బీఆర్ఎస్ వచ్చాక SLBCని పండబెట్టారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడాడని కౌంట‌ర్ ఇచ్చారు హ‌రీష్ రావు. కానీ వాస్తవానికి ఏడేళ్లలో రూ.1,358 కోట్ల వ్యయంతో 11.48 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసిందని తెలిపారు. SLBCలో భాగమైన డిండి, పెండ్లిపాక రిజర్వాయర్లని సైతం రూ.3892 కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ సర్కార్ చిత్తశుద్ధితో నిర్మించిందని తెలిపారు. రెండేళ్లలోనే ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్.. రెండేళ్లలో టన్నెల్‌ని తవ్వింది కేవలం 18 మీటర్ల మాత్రమే అంటూ కౌంట‌ర్ ఇచ్చారు. Kavitha

Also Read: Chandrababu: మరో రూ.6,500 కోట్ల కొత్త అప్పు..చంద్ర‌బాబు సంచ‌ల‌నం ?

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu