Ponnam Vs Adluri: దున్న‌పోతు వివాదం…నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే…అడ్లూరి వార్నింగ్ ?

Ponnam Vs Adluri: తెలంగాణ రాష్ట్రంలో దున్న‌పోతు వివాదం రాజుకుంటోంది. నాకు పొన్నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందే అడ్లూరి వార్నింగ్ ఇచ్చారు. దున్నపోతు వ్యాఖ్యలపై మల్లికార్జున ఖర్గేకు, మీనాక్షికి లేఖ రాశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ డెడ్‌లైన్ కూడా విధించారు. దున్నపోతు వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రుల మధ్య వివాదం ముదురుతోంది. రేపటి వరకు సమయమిస్తున్నా.. పొన్నం క్షమాపణలు చెప్పాలని హెచ్చ‌రించారు. Ponnam Vs Adluri

Ponnam Prabhakar VS Adluri Laxman

దీనిపై పొన్నం మాట మారిస్తే తర్వాత జరిగే పరిణామాలకు ఆయనే బాధ్యత వహించాలని స్ప‌ష్టం చేశారు. నేను మాదిగ జాతిలో పుట్టి మంత్రి అవ్వడమే తప్పా? దీనిపై ఇప్పటికే మీనాక్షికి లేఖ రాశానని పేర్కొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. త్వరలో సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేను కలుస్తానని స్ప‌ష్టం చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇక అటు నేను దున్నపోతు అన్నప్పుడు.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పేరును ఎక్కడా ప్రస్తావించలేదని క్లారిటీ ఇచ్చారు పొన్నం ప్రభాకర్. Ponnam Vs Adluri

Also Read: Balayya: బాలయ్యకు ఎల్లో మీడియా వెన్నుపోటు…ఇక ఒంటరివాడు కానున్నాడా?

దున్నపోతు అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కమ్యూనికేషన్ గ్యాప్ తప్ప ఇంకేం లేదన్నారు. ఈ విషయంపై అడ్లూరితో మాట్లాడేందుకు ప్రయత్నించాను.. కానీ అందుబాటులోకి రాలేద‌న్నారు పొన్నం ప్రభాకర్. దీనిపై మహేష్ కుమార్ గౌడ్‌తో కూడా మాట్లాడానని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. Ponnam Vs Adluri

Also Read: Salt: మోతాదుకు మించి ఉప్పు తీసుకుంటే ప్ర‌మాద‌మేనా..ఇవి తెలుసుకోండి?