KCR: ప్రజలు బయటకు రమ్మన్నా.. KCR ఎందుకు రావడం లేదంటే?

KCR: గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రత్యేకంగా పార్టీని స్థాపించి 14 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా పోరాటం చేశారు కేసీఆర్. ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా 10 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఆయనకు ప్రజలు అవకాశం ఇచ్చారు. దానికి తగ్గట్టుగానే గత పది సంవత్సరాల లో తెలంగాణ రాష్ట్రాన్ని ఉన్నత శ్రేణి రాష్ట్రంగా నిలబెట్టాడు కేసీఆర్. అయితే కొన్ని అనువార్య కారణాలవల్ల మూడోసారి ముఖ్యమంత్రి కాకుండా కేసీఆర్ పార్టీని ఓడించింది తెలంగాణ ప్రజానీకం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. KCR

KCR Why not coming outside from farm house

అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు దాటిపోయింది. ఈ రెండు సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ప్రజలే చెబుతున్నారు. హైడ్రా అలాగే ఇతర సమస్యలతో తెలంగాణ ప్రజలు సతమతమవుతున్నారని తెలుస్తోంది. దీంతో చాలామంది కెసిఆర్ మళ్ళీ ప్రజల్లోకి రావాలని కోరుతున్నారు. ప్రజల్లోకి వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై పోరాటం చేయాలని అంటున్నారు. అయితే తెలంగాణ ప్రజలు అంతలా పిలిచినా కూడా కేసీఆర్ బయటకు రావడం లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో కూడా కాలు బయట పెట్టలేదు. KCR

Also Read: Shreyas Iyer: టాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయాస్ అయ్య‌ర్ ఎ**ఫైర్ ?

ఆయన బయటకు వస్తే ఖచ్చితంగా గులాబీ పార్టీకి మంచి మైలేజ్ వస్తుంది. కానీలేదన్న ఆందోళన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయన రాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. త్వరలోనే పార్టీ ఫిరాయించిన పదిమందిపై కోర్టు చర్యలు తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు పది ఉప ఎన్నికలు ఖాయం. అయితే ఈ పది స్థానాల్లో కనీసం ఐదు నుంచి 6 గులాబీ పార్టీ గెలిచినా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం గ్యారెంటీ. అయితే ఆ ఎన్నికల సమయంలో ప్రజల్లోకి వచ్చి పోరాటం చేయాలన్నది కేసీఆర్ లక్షమట. అదే సమయంలో పార్టీకి అన్యాయం చేసిన వాళ్లకు కూడా చెక్ పెట్టేందుకు ఈ దిశగా అడుగులు వేస్తున్నారట. అందుకే ఆ ఎన్నికల సమయంలోనే బయటకు వచ్చి కాంగ్రెస్ తాటతీయాలని స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. అంటే 2026 మే సమయానికి ఈ 10 ఉప ఎన్నికలు వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి. అప్పటివరకు కేసీఆర్ ప్రజల్లోకి రాకపోవచ్చు. KCR

Also Read: Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

Share your love