Telangana GP elections: సర్పంచ్ పదవికి వేలంపాట.. రూ.73 లక్షలకు ఏకగ్రీవం

Telangana GP elections: తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మూడో విడతల్లో తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. మొదటి విడుదల డిసెంబర్ 11వ తేదీన సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారు. Telangana GP elections

Telangana GP elections Auction for the post of Sarpanch Unanimous for Rs. 73 lakhs

రెండవ విడత డిసెంబర్ 14వ తేదీన జరగనుంది. డిసెంబర్ 17వ తేదీన మూడవ విడత ఉంటుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు లోకల్ బాడీ ఎన్నికలపై దృష్టి పెట్టాయి. ఇక అదే సమయంలో ఏకగ్రీవాల హవా కొనసాగుతోంది. తాజాగా సర్పంచి పదవి కోసం వేలంపాట కూడా నిర్వహించారు. ఇందులో 73 లక్షల రూపాయలు పలికి సర్పంచ్ పదవిని ఓ మహిళ దక్కించుకుంది. నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా 11 మంది నామినేషన్ వేశారు. Telangana GP elections

Also Read: Shreyas Iyer: టాలీవుడ్ హీరోయిన్ తో శ్రేయాస్ అయ్య‌ర్ ఎ**ఫైర్ ?

ఆ తర్వాత గ్రామంలోని కనకదుర్గ ఆలయ నిర్మాణం, గ్రామాభివృద్ధి కోసం ఏకగ్రీవం చేయాలని నిర్ణయించి సర్పంచ్ పదవిని వేలం పాట ప‌డారు. ఈ త‌రుణంలోనే రూ.73 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి. దీనికి అంగీకరిస్తూ నామినేషన్ విత్ డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రంపై సంతకం చేశారు మిగతా అభ్యర్థులు. దీంతో బంగారిగడ్డ గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయింది.. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. Telangana GP elections

Also Read: Chandrababu: చంద్ర‌బాబు సంచ‌ల‌నం..జోనల్‌ వ్యవస్థకు గ్రీన్ సిగ్నల్..ఇక‌పై త్రిముఖ వ్యూహం ?

Share your love