Chandrababu: ఆ మచ్చను తుదిచేసుకున్న నారా లోకేష్.. తండ్రికి తగ్గ తనయుడిగా!!

Chandrababu: రాజకీయ రంగంలో తండ్రి–కొడుకుల కలయిక కొత్త విషయం కాదు. కానీ చాలా సందర్భాల్లో ఇలాంటి కుటుంబ రాజకీయాలు విభేదాలకు దారి తీస్తాయి. అయితే, నారా లోకేష్–చంద్రబాబు జంట మాత్రం ఈ సాంప్రదాయాన్ని మార్చేస్తున్నారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇద్దరూ భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినా, ఒకే లక్ష్యం కోసం – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కలిసి పని చేస్తున్నారు.

Lokesh Chandrababu rare political relationship

2014 నుంచి చంద్రబాబు నాయకత్వంలో నారా లోకేష్ చురుకైన రాజకీయ పాత్ర పోషిస్తున్నారు. లోకేష్ పట్ల చంద్రబాబు చూపుతున్న విశ్వాసం, మార్గదర్శకత పార్టీ బలాన్ని మరింత పెంచిందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో లోకేష్ చేసిన relentless fight, ఢిల్లీ పర్యటనలు ఆయన కట్టుబాటును చూపించాయి. ఆ సమయంలో ఆయన ప్రదర్శించిన leadership qualities సోషల్ మీడియాలో విపరీతమైన ప్రశంసలు అందుకున్నాయి.

ప్రస్తుతం ఈ తండ్రీ–కొడుకులు ఇద్దరూ పెట్టుబడుల వేటలో ఏపీకోసం కృషి చేస్తున్నారు. ఒకరిపై ఒకరికి mutual respect, political understanding ఉండటమే వీరి బలం. సోషల్ మీడియాలో “ఇలాంటి తండ్రి–కొడుకు జంట రాజకీయాల్లో దొరకడం చాలా అరుదు” అని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లో విభేదాలతో దూరమైన రాజకీయ కుటుంబాల పరిస్థితి చూస్తే, నారా కుటుంబం సామరస్యానికి ఒక ఉదాహరణగా నిలుస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రలో తండ్రి–కొడుకుల మధ్య వచ్చిన విభేదాలతో పోల్చితే, చంద్రబాబు–లోకేష్ సంబంధం భిన్నమైనదని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. వీరి కలసికట్టే టీడీపీ భవిష్యత్తుకు పునాది వేస్తోందని చెబుతున్నారు.

Share your love