రవితేజ సినిమాలు ఎప్పుడూ చెప్పిన డేట్ కు రావు. చాలాసార్లు ఆయన సినిమాలు వాయిదా పడటం జరుగుతుంటుంది. రవితేజ కొత్త చిత్రం మస్ జాతర కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతోంది. ఈ సినిమాను కూడా సంక్రాంతికి రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఇప్పుడు మాస్ జాతర ఆగష్టు 27న రావాలి కానీ ఈ డేట్ కూడా వాయిదా తప్పదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అంతా టీమ్ మొత్తం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా ఉంటోంది.
ఈ నెల 27 అంటే ఇంకా 11 రోజులు మాత్రమే ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రం పెండింగ్ ఉంది. దీంతో మాస్ జాతర సినిమా పోస్ట్ పోన్ అవ్వడం ఖాయమని అంటున్నారు. రీసెంట్ టీజర్ లో మాత్రం డేట్ ఆగస్టు 27 అనే చెప్పారు. త్వరలో కొత్త రిలీజ్ డేట్ పై అప్డేట్ ఇస్తారని తెలుస్తోంది. మాస్ జాతర టీజర్ కు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. కంటెంట్ మరీ రొటీన్ గా ఉందనే విమర్శలు వచ్చాయి. సినిమా కూడా ఇలాగే ఉంటుందా అనే అనుమానాలు ఏర్పడుతున్నాయి.





