మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈరోజు ఆయన కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. దర్శకుడు బాబీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. కన్నడ, తమిళంలో పలు భారీ చిత్రాలు నిర్మిస్తున్న ఈ సంస్థ తెలుగులో మెగాస్టార్ మూవీతో ఎంట్రీ ఇస్తోంది.
మెగా 158గా పిలుస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో బ్లడీ బెంచ్ మార్క్ క్రియేట్ చేయనున్న బ్లేడ్ అంటూ క్యాప్షన్ రాశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో బాబీ, చిరంజీవి కాంబోలో వాల్తేరు వీరయ్య సినిమా రూపొందింది. ఈ చిత్ర ప్రచార సమయంలోనే బాబీతో మరో సినిమా చేస్తానంటూ మెగాస్టార్ మాటిచ్చారు. ఇప్పుడు వీరి కాంబోలో మూవీ అఫీషియల్ గా అనౌన్స్ మెంట్ చేసుకుంది.





