Megastar: డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్న మెగాస్టార్ కొడుకు.. బుద్ధి లేదా అంటూ.!

Megastar son who bought an Award with money

Megastar: సినిమా ఇండస్ట్రీలో వచ్చే అవార్డులు తమ ప్రతిభకి గుర్తింపుగా వస్తాయి. ఎవరైతే అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తారో వారికి అవార్డుల పేరుతో ఒక గుర్తింపుని ఇస్తారు.అలా హీరో హీరోయిన్లు యాక్టింగ్ తో,మ్యూజిక్ డైరెక్టర్లు మ్యూజిక్ తో,దర్శకుడు దర్శకత్వ ప్రతిభతో ఇలా కొన్ని విభాగాలలో అవార్డులు అనేవి ఇస్తారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఒక విషయం వైరల్ అవుతుంది. మెగాస్టార్ కొడుకు డబ్బులు ఇచ్చి అవార్డు కొనుక్కున్నారు అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Megastar son who bought an Award with money

మరి ఇంతకీ డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కున్న ఆ హీరో ఎవరు? ఆ విమర్శలు ఏంటి అనేది చూద్దాం. డబ్బులు పెట్టి మెగాస్టార్ కొడుకు అవార్డు కొనుక్కున్నారు అంటే చాలామందికి టక్కున గుర్తుకొచ్చేది మెగాస్టార్ కొడుకు అంటే రామ్ చరణ్ కదా.. రామ్ చరణ్ డబ్బులు పెట్టి అవార్డు కొనుక్కోవడం ఏంటి అని అనుకుంటారు. అయితే రామ్ చరణ్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. ఎందుకంటే మెగాస్టార్ కొడుకు అంటే టాలీవుడ్ మెగాస్టార్ కాదు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కొడుకు అభిషేక్ బచ్చన్.. (Megastar)

Also Read: Ajith: అజిత్ పై ఆ హీరో తండ్రి చేతబడి.. బయటపడ్డ షాకింగ్ నిజం.!

అభిషేక్ బచ్చన్ నటించిన ఐ వాంట్ టు టాక్ అనే మూవీ లోని ఆయన నటనకి గాను బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ అవార్డు అభిషేక్ బచ్చన్ డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అనే విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ ట్రోల్స్ చూసిన అభిషేక్ బచ్చన్ వాటిపై స్పందిస్తూ.. హార్డ్ వర్క్ వల్ల,చెమట,రక్తం చిందించడం వల్లే అవార్డులు వస్తాయి. డబ్బులు పెట్టి అవార్డును కొనుక్కోవడం వంటివి ఏమీ లేదు.అలాగే పిఆర్ స్టంట్ కూడా ఏదీ లేదు.. ఇక ఇలాంటి ట్రోల్స్ చేసేవారి నోళ్లు మూయించాలంటే నేను మరింత కష్టపడడమే..

Megastar son who bought an Award with money

మీరు నాకు వచ్చిన అచీవ్మెంట్స్ పై అనుమాన పడకూడదు అంటే నేను భవిష్యత్తులో మరిన్ని సాధించాలి.. భవిష్యత్తులో మరెన్నో సాధించి మీరు రాంగ్ అని నిరూపిస్తాను.. అంటూ ట్రోల్స్ చేసేవారికి ఒకే ఒక్క పోస్టుతో కౌంటర్ ఇచ్చారు అభిషేక్ బచ్చన్.. ఇక తనపై ట్రోల్స్ చేసిన వారికి అభిషేక్ బచ్చన్ ఇచ్చిన కౌంటర్ పట్ల చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇలాంటి వాటిని పట్టించుకోనట్టు ఉండకుండా మీ స్టైల్ లో ఇచ్చిన కౌంటర్ అదుర్స్ అంటూ ఆయన ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.(Megastar)

Share your love