తెలుగు చిత్ర పరిశ్రమలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి బాహుబలి మూవీస్. బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్ క్లూజన్ సినిమాలు హీరో ప్రభాస్ కు పాన్ ఇండియా స్టార్ డమ్ తీసుకొచ్చాయి. ఇప్పుడీ రెండు చిత్రాలను కలిపి దర్శకుడు రాజమౌళి బాహుబలి, ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 31న 3 గంటల 40 నిమిషాల నిడివితో ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. బాహుబలి రెండు చిత్రాల్లో లేని కొత్త సీన్స్ ను ఈ బాహుబలి ది ఎపిక్ లో యాడ్ చేస్తున్నారట. టీవీలు, ఓటీటీల్లో బాహుబలి చాలాసార్లు చూశామని అనుకునే ఆడియెన్స్ కు ఈ సీన్స్ కొత్త ఎక్సిపీరియన్స్ ఇస్తాయని టీమ్ ఆశిస్తోంది. అలాగే ఒక కొత్త సినిమా రిలీజ్ కి ఎలాగైతే ప్రమోషన్స్ చేస్తారో అలా ఈ మూవీకి ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుండడం విశేషం.





