Smriti Mandana:కాబోయే వాడి ఫోటోలు డిలీట్.. స్మృతి మందాన పెళ్లి వాయిదాపై కొత్త అనుమానాలు..!

New suspicions on Smriti Mandana wedding postponement

Smriti Mandana: భారత క్రికెటర్ స్మృతి మంధాన మరియు సంగీత స్వరకర్త పలాష్ ముచ్చల్ వివాహ వేడుక అకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి మనకు తెలిసిందే. స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ రావడంతో ఈ పెళ్లి వాయిదా పడింది. పెళ్లి పనుల టెన్షన్ ఉండడం వల్లే స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చినట్టు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.అలా పెళ్లి పనులు జరుగుతుండగానే గుండెపోటు రావడంతో ఈ విషయం కాస్త నెట్టింట వైరల్ గా మారింది.

New suspicions on Smriti Mandana wedding postponement

దాంతో వెంటనే స్మృతి తండ్రిని సాంగ్లీలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతం ఆయనకి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతం స్మృతి మందాన కుటుంబ సభ్యులందరూ అదే హాస్పిటల్లో ఉన్నారు. అయితే స్మృతి మందాన తండ్రి ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ మరో విషయం హాట్ టాపిక్ గా మారింది. అదేంటంటే స్మృతి మందానాకి కాబోయే భర్త పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యం బారిన పడటంతో ఆయన్ని కూడా హాస్పిటల్ లో చేర్పించారట. (Smriti Mandana)

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జాతకంలో దోషం…నిన్న తండ్రి, నేడు కాబోయే భ‌ర్త‌?

అలా వెంట వెంటనే ఇద్దరికీ అస్వస్థత కలగడంతో స్మృతి మందాన కుటుంబాన్ని ఈ విషయం బాధలో ముంచేసింది. ఇదంతా పక్కన పెడితే తాజాగా సోషల్ మీడియాలో ఓ కొత్త రూమర్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఓవైపు స్మృతి మందాన తండ్రికి హార్ట్ ఎటాక్ వచ్చింది అనుకుంటే మరోవైపు ఆమెకు కాబోయే భర్త కూడా అనారోగ్యం బారిన పడ్డారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో స్మృతి మందాన తనకి కాబోయే భర్త దిగిన ఫోటోలు అన్నింటినీ డిలీట్ చేసినట్టు తెలుస్తోంది.

New suspicions on Smriti Mandana wedding postponement

తన సోషల్ మీడియా ఖాతాలో కాబోయే భర్తతో దిగిన ఫోటో ఒక్కటి కూడా లేకపోవడంతో కొత్త అనుమానాలకు తెరలేసింది. వీరి పెళ్లి తాత్కాలికంగా వాయిదా పడిందా.. లేక శాశ్వతంగా వాయిదా పడిందా అని కొంతమంది భావిస్తున్నారు. ఎందుకంటే వీరు ఇద్దరూ కలిసి ఉన్న ఫోటోలు డిలీట్ చేయడంతో పాటు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించకపోయేసరికి ఈ వార్త వైరల్ గా మారింది. మరి స్మృతి మందాన పెళ్లిని పూర్తిగా వాయిదా వేసిందా..సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.(Smriti Mandana)

Share your love