
Palmistry: చేతి రేఖలు ప్రకారం చేతిలో కొన్ని రకాల చిహ్నాలు ఉన్నట్లయితే ధన లాభం కలుగుతుంది. అరచేతిలో త్రిభుజం ఉండడం వల్ల శుభసంకేతంగా భావించాలి. ప్రాథమికంగా త్రిభుజం ధన లాభాన్ని తీసుకువస్తుంది. అరచేతిలో త్రిభుజం ఉన్నట్లయితే చాలా మంచిది. మూడు రేఖలు ఆరోగ్య రేఖ, మెదడు రేఖ త్రిభుజంగా ఏర్పడితే మీ జీవితం సంపూర్ణంగా మారుతుందని అర్థం. అరచేతులపై ఈ గుర్తులు ఉన్న వ్యక్తులు వారి జీవితంలో విజయం సాధిస్తారు. అరచేతులపై ఈ గుర్తు ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి నష్టాలను చవిచూడరు. వారు చేసే పనిలో ఆదాయం పొందుతారు. అరచేతులపై త్రిభుజాకార గుర్తు ఉన్నవారికి వ్యాపారంలో విజయం సాధిస్తారు. Palmistry
Palmistry Basics A Simple Guide To Understanding Hand Lines
ఈ రంగంలో వారు ప్రత్యేక ప్రతిభను కనబరుస్తారు. కమలం చిహ్నం చేతిలో ఉండడం వల్ల విష్ణు యోగాన్ని సూచిస్తుంది. దీనివల్ల విష్ణుమూర్తి యొక్క ఆశీస్సులు ఉంటాయి. ప్రారంభించే పనులు విజయవంతం అవుతాయి. కమలం చిహ్నాన్ని విష్ణువు ఆశీస్సులు మాత్రమే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదాలు కూడా పొందే చిహ్నంగా భావించాలి. అరచేతులపై కమలం పువ్వు ఆకారం ఉన్న వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. రాజకీయాలు, సామాజిక సేవ రంగాలలో విజయం సాధిస్తారు. రాజకీయాలలో ఉన్నత స్థాయి పదవులను పొందుతారు. వారు జీవితంలో ఎల్లప్పుడు ఎంతో విజయాలను సాధిస్తారు. ఈ గుర్తు ఉన్న వ్యక్తులకు వ్యాపార రంగాలలో, ఉద్యోగాలలో మంచి విజయం ఉంటుంది. Palmistry
Also Read: Snake gourd: పొట్లకాయని అస్సలు లైట్ తీసుకోవద్దు.. కాన్సర్ ను కూడా బొంద పెడుతుందట…
అరచేతిలో చేప ఆకారం ఉన్నట్లయితే ఆకస్మాత్తుగా డబ్బు అందుతుంది. లాటరీ, స్టాక్ మార్కెట్, వాణిజ్యం, విదేశీ పెట్టబడులు మొదలైన వాటి ద్వారా ఆకస్మికంగా ఆదాయం లభిస్తుంది. అరచేతిలో చేప చిహ్నం మణికట్టు వద్ద ఉంటుంది ఇది సంపాదన తీసుకువస్తుంది. అరచేతులపై చేప చిహ్నం ఉన్న వ్యక్తులు పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలలో ఆశించిన విధంగా ఫలితాలను సాధిస్తారు. ఆదాయాన్ని సంపాదించే అవకాశం అధికంగా ఉంటుంది. హస్త సాముద్రికం ప్రకారం త్రిభుజం, కమలం చిహ్నం, చేప చిహ్నం ఈ మూడు చిహ్నాలను బలమైనవిగా భావిస్తారు. ఈ చిహ్నాలు ఒక వ్యక్తి జీవితంలో సంపద ప్రవాహాన్ని నిర్ధారిస్తాయి. ఆదాయాన్ని పెంచేవారు ఆర్థిక స్థితిని మెరుగుపరిచే చిహ్నాలుగా భావిస్తారు. ఈ అదృష్టాన్ని నిలబెట్టుకోవడానికి కృషి, విశ్వాసం, పట్టుదల అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Palmistry
Also Read: Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ శవాలు లేస్తాయి… గులాబీ పార్టీకి నవీన్ యాదవ్ వార్నింగ్…

