
Thaman: మెగా హీరో రామ్ చరణ్ కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. చిరంజీవి నటవారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కానీ సొంత టాలెంట్ తో స్టార్ హీరోగా మారారు. అలాంటి రామ్ చరణ్ నటనలో అయినా డ్యాన్సులో అయినా మేటి అని చెప్పవచ్చు.
Thaman once again vents his venom on the movie Game Changer
ఆయనను దర్శకులు ఏ విధంగా వాడుకుంటే ఆ విధంగా రిజల్ట్ ఉంటుందని, కానీ కొంతమంది ఆయనలో టాలెంట్ ను గుర్తించకపోవడం వల్ల కొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అన్నారు. ఆ మధ్యకాలంలో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమాలో హుక్ స్టెప్స్ లేవంటూ అసంతృప్తి వ్యక్తం చేయగా అది కాస్త చర్చనీయాంశంగా మారింది.. (Thaman)
Also Read: Vijay: మతిలేని విజయ్ వల్ల తొక్కిసలాట..15 రోజుల ముందే ఉహించిన వ్యక్తి.. ట్వీట్ వైరల్.!
అయితే తమన్ అన్నది రామ్ చరణ్ ను నిందించడానికి కాదని, నా మాటలు కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని తెలియజేశారు. రామ్ చరణ్ పెద్ద డాన్సర్.. ఆయన నటించిన నాయక్ లోని “లైలా ఓ లైలా” బ్రూస్ లీ లోని ‘మెగా మెగా మెగా మీటర్’ లాంటి పాటలకు అద్భుతమైన స్టెప్పులు వేశారు.. ఇంత ఎనర్జీ ఉన్నటువంటి రామ్ చరణ్ ను గేమ్ ఛేంజర్ సినిమాలో కొరియోగ్రాఫర్లు సరిగ్గా వాడుకోలేకపోయారని, సరైన మూమెంట్స్ ఇవ్వలేకపోయారని అన్నారు..

ఈ విధంగా రామ్ చరణ్ టాలెంట్ ను కొరియోగ్రాఫర్లు గుర్తించలేదని నేను మాట్లాడితే ఆయన అభిమానులు కొందరు మా హీరోని టార్గెట్ చేశారు అంటూ నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.. ఆ చిత్రంలో రామ్ చరణ్ ను సరిగ్గా వాడుకోలేకపోయారు అన్నదే నా బాధ..మరో ఉద్దేశంతో అనలేదని తమన్ క్లారిటీ ఇచ్చారు. రామ్ చరణ్ చాలా మంచి వ్యక్తి అందుకే ఆయన నేను మెగా హార్ట్ స్టార్ అని పిలుస్తానని తెలియజేశారు.(Thaman)





