Rastra Rajneeti: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌పై మ‌రో స‌ర్వే..ఆ పార్టీ స్పీడ్ కు బ్రేక్ లేదు ?

Rastra Rajneeti: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేప‌థ్యంలో సంచ‌ల‌న స‌ర్వేలు బ‌య‌టకు వ‌స్తున్నాయి. ఇప్ప‌టికే చాలా స‌ర్వేలు వ‌చ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్‌దే గెలుపు అంటూ అనేక స‌ర్వే సంస్థ‌లు వెల్ల‌డిస్తున్నాయి. హెచ్ఎం టీవీలో సంచలన సర్వే బయటపెట్టారు రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్. 6% ఆధిక్యంలో బీఆర్ఎస్, మాగంటి సునీతకు విజయావకాశాలు ఉన్నాయని వెల్లడించింది ఈ స‌ర్వే. Rastra Rajneeti

Rastra Rajneeti Another survey on the Jubilee Hills by-election

బీఆర్ఎస్ 40%, కాంగ్రెస్ 34%, బీజేపీ 21%, ఎంఐఎం 4% ఓట్లు వచ్చే అవకాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్. దాదాపు 8,000 శ్యాంపిల్స్‌తో గత నెలలో జూబ్లీహిల్స్ సర్వే చేసింది రజినీకాంత్ టీం. ఇప్పటికి, మైనారిటీలు బీఆర్ఎస్ వైపే, బస్తీలలో బీఆర్ఎస్‌కు ఆదరణ త‌గ్గ‌లేద‌ని తేల్చింది రాజనీతి స్ట్రాటజీస్ రజనీకాంత్ సంస్థ‌.

Also Read: OG Movie: కాసుల కోసం నిర్మాత దిల్ రాజు కక్కుర్తి.. OG టికెట్ రూ.2000…

కాంగ్రెస్ పథకల అమలు సరిగా లేకపోవడంతో తీవ్రంగా పెరిగిన ప్రజా వ్యతిరేకతను బ‌య‌ట‌పెట్టింది. హైదరాబాద్ సిటీలో కాంగ్రెస్ చేసింది ఏం లేదనే భావనలో జూబ్లీహిల్స్ ప్రజలు ఉన్నార‌ని స‌మాచారం అందుతోంది. హైడ్రా అడ్డగోలు కూల్చివేతలతో పేద ప్రజలకు దూరమైంద‌ట‌ రేవంత్ సర్కారు. ఎంఐఎంతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా, గెలవడం కష్టమే అంటున్నారు రజనీకాంత్.

Also Read: OG Movie: “ఓజి” కోసం మిరాయ్ కి అన్యాయం.. థియేటర్లు లాగేసుకున్నారు ?

Share your love