KTR : పార్టీ ఫిరాయింపుల్లో రాహుల్ గాంధీ ప్ర‌థ‌మ ముద్దాయి.. కేటీఆర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ktr
ktr
ktr

KTR : పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ల‌పై బీఆర్ఎస్ దాఖ‌లు చేసిన పిటిష‌న్ల పై అసెంబ్లీ స్పీక‌ర్ గ‌డ్డం ప్ర‌సాద్ ఇచ్చిన తీర్పు అత్యంత అప్ర‌జాస్వామికం, దారుణ‌మ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమ‌ర్శించారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ఆడిస్తున్న ఆట‌లో భాగంగానే స్పీక‌ర్ ప్ర‌సాద్ కుమార్ పిటిష‌న్లను డిస్మిస్ చేశార‌ని తెలిపారు. అసెంబ్లీ స్పీక‌ర్ పై రాహుల్ గాంధీ నుంచి తీవ్ర‌మైన ఒత్తిడి ఉంద‌ని చెప్పారు. తెలంగాణ నుంచి వ‌స్తున్న డ‌బ్బు సంచుల కోసం ఇలాంటి అనైతిక కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని మండిప‌డ్డారు.

Rahul Gandhi is the first accused in party defections.. KTR’s comments

పార్టీ ఫిరాయింపుల వ్య‌వ‌హారాన్ని కాంగ్రెస్ పార్టీ న‌డిపించింద‌ని.. స్పీక‌ర్ చేతుల్లో నిర్ణ‌యాధికారం లేద‌న్నారు. పార్టీ పిరాయింపుల్లో ప్ర‌థ‌మ ముద్దాయి రాహుల్ గాందీ అని.. ప్ర‌జా స్వామ్యం భార‌త రాజ్యాంగం పై కాంగ్రెస్ చేస్తున్న దాడిలో ప్ర‌ధాన నేర‌స్తుడు రాహుల్ గాంధీ అని కేటీఆర్ విమ‌ర్శించారు. రాహుల్ గాంధీ అనుమ‌తి లేకుండా అన‌ర్హ‌త పిటిష‌న్లు డిస్మిస్ చేసేంత సాహ‌సం స్పీక‌ర్ చేయ‌లేర‌న్నారు.

ALSO READ : CM REVANTH REDDY : బినామీ కంపెనీని కాపాడుకునేందుకు ప్ర‌భుత్వ ఉద్యోగుల‌ను బ‌లి చేస్తున్న రేవంత్ రెడ్డి

మ‌రోవైపు ఖ‌మ్మం జిల్లా వెలుగుమ‌ట్ల‌లోని భూదాన్ భూముల్లో పేద‌ల ఇళ్ల కూల్చివేత అంశాన్ని అసెంబ్లీ ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌శ్నించి తీరుతామ‌ని పేర్కొన్నారు కేటీఆర్. భూ మాఫియాగా ఏర్ప‌డి పేద‌ల మీద దాడి చేసి బ‌య‌టికి పంపుతున్నారు. వెలుగుమ‌ట్ల‌తో పాటు రాష్ట్రంలో కూల‌గొడుతున్న ప్ర‌తీ ఇంటికీ ప‌ట్టా ఇచ్చేంత వ‌ర‌కు వ‌దిలిపెట్ట‌మ‌ని తెలిపారు. ఇల్లు కోల్పోయి ఏడుస్తున్న బాధితుల‌ను పెయిడ్ ఆర్టిస్టులు అని మృగాల్లా మాట్లాడ‌టం సిగ్గు చేట‌న్నారు.

Also Read : WOMENS RESERVATION : మ‌హిళ‌ల రిజ‌ర్వేష‌న్ల పై కేంద్రం సంచ‌ల‌న‌ నిర్ణ‌యం..!

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu