Abbas: ఆ హీరో వెన్నుపోటుతో స్టార్ హీరో నుండి బాత్రూం క్లీనర్ గా మారిన అబ్బాస్.!

Abbas who went from being a star hero to a bathroom cleaner because of that hero

Abbas: ఏంటి ఆ స్టార్ హీరో వల్లే అబ్బాస్ స్టార్ హీరో రేంజ్ నుండి బాత్రూం క్లీన్ చేసేవాడిగా తయారయ్యాడా..ఇంతకీ అబ్బాస్ ను వెన్నుపోటు పొడిచిన ఆ హీరో ఎవరు అనేది చూస్తే.. తమిళ నటుడు విశాల్.. అవును మీరు వినేది నిజమే. ఎందుకంటే ఈ విషయాన్ని స్వయంగా అబ్బాస్ ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. విశాల్ వల్లే నా జీవితం ఇలా అయిందని..విశాల్ నాకు వెన్నుపోటు పొడిచారు అంటూ ఓ సంచలన విషయాన్ని బయట పెట్టారు.

Abbas who went from being a star hero to a bathroom cleaner because of that hero

అయితే వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు ఏంటంటే.. కర్ణాటక, తమిళ, కేరళ, తెలుగు ఈ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ కలిసి సెలబ్రిటీ క్రికెట్ లీక్ టోర్నమెంట్ నిర్వహించుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ టోర్నమెంట్లో ఈ రాష్ట్రాల హీరోలందరూ కలిసి ఆడతారు. అయితే ఈ టోర్నమెంట్ ని స్టార్ట్ చేసిందే అబ్బాస్.. తన సొంత డబ్బులతో నాలుగు ఇండస్ట్రీలో ఉన్న నటలందరినీ ఏకం చేసి సీసీఎల్ నిర్వహించారట. ఇలా నిర్వహించే సమయంలో కొంచెం కష్టమైనప్పటికీ డబ్బు మాత్రం బాగానే వచ్చిందట. (Abbas)

Also Read: Dharmendra: ధర్మేంద్ర ఆస్తిలో చిల్లిగవ్వ కూడా హేమమాలినికి రాదా.. న్యాయవ్యవస్థ ఏం చెబుతుందంటే.?

కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి విశాల్ అబ్బాస్ పేరుని బయటికి రాకుండా తానే అదంతా చేస్తున్నట్టు చెప్పుకొని అబ్బాస్ పెట్టిన డబ్బులు వెనక్కి రాకుండా,ఆదాయం కూడా రాకుండా చేసి వెన్నుపోటు పొడిచారట.దాంతో అబ్బాస్ చేసేదేమీ లేక సైలెంట్ గా అందులో నుండి తప్పుకున్నారట. పోరాడే శక్తి ఉన్నప్పటికీ గొడవ పడడం ఇష్టం లేక సైలెంట్ గా అందులో నుండి తప్పుకొని న్యూజిలాండ్ వెళ్లిపోయారట అబ్బాస్.

Abbas who went from being a star hero to a bathroom cleaner because of that hero

ఇక ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొని విశాల్ వల్లే నా పరిస్థితి ఇలా తయారయిందని తెలిపారు. ఇక న్యూజిలాండ్ వెళ్ళాక పెట్రోల్ బంకుల్లో పనిచేయడం, బాత్రూం క్లీనర్ గా.. సూపర్ మార్కెట్లో ఇలా ఎన్నో పనులు చేసి తన కుటుంబాన్ని పోషించుకున్నారట. తన కుటుంబాన్ని పోషించడం కోసం ఏ పనైనా నేను చేస్తానని.. ప్రస్తుతం నా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది అని అబ్బాస్ చెప్పుకొచ్చారు.అలా విశాల్ కారణంగా అబ్బాస్ ఇండియా వదిలి న్యూజిలాండ్ వెళ్లినట్లు తెలుస్తోంది.(Abbas)

Share your love