
Revanth VS Uttam: తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. నా లైవ్ ఎలా కట్ చేస్తారు ? అని రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ ఫైర్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు గులాబీ పార్టీ నేతలు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు. మరోసారి కాంగ్రెస్ అంతర్గత విభేదాలు బట్టబయలైనట్లు బీఆర్ ఎస్ పార్టీ ట్రోల్ చేయడం మొదలు పెట్టింది. Revanth VS Uttam
Revanth VS Uttam over live presentation
కృష్ణా, గోదావరి నదులపై ఉత్తమ్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లైవ్ కట్ చేశారట. ఉత్తమ్ ప్రజెంటేషన్‌లో తప్పులు చెప్తే నష్టమని లైవ్ కట్ చేయించాడని రేవంత్ రెడ్డిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి సీరియస్ అవుతున్నారట. సరిగ్గా రేవంత్ రెడ్డి మాట్లాడగానే మళ్ళీ లైవ్ షురూ చేశారట. ఈ విషయం తెలిసి షాకైన ఉత్తమ్… సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. Revanth VS Uttam
Also Read: Jagan: కర్మకాలి జగన్ అధికారంలోకి వస్తే, కూరలో పసుపు వేయడానికి కూడా వణికిపోతారు ?
గంటన్నర పాటు ఇచ్చిన ప్రజెంటేషన్ వృధా అయిందని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారట. కష్టపడి ప్రిపేర్ అయి వస్తే లైవ్ కట్ చేశారంటూ వాపోయారట మంత్రి ఉత్తమ్ కుమార్. రేవంత్ ఆదేశాలతోనే లైవ్ కట్ చేశారనే అనుమానంతో ఫోన్‌లోనే రేవంత్ రెడ్డికి క్లాస్ ఇచ్చినట్లు వార్తలు అవుతున్నాయి. నా ప్రజెంటేషన్‌కి ఆగిన లైవ్ మీరు మాట్లాడగానే ఎలా వచ్చిందని తీవ్రంగా మండిపడ్డారట. రేవంత్ రెడ్డి తీరుపై సహచర మంత్రులకు ఫోన్ చేసి మరీ చెప్పుకున్నారట ఉత్తమ్ రెడ్డి. దీంతో ఈ న్యూస్ వైరల్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. Revanth VS Uttam
Also Read: Divvela madhuri: అప్పన్న ఆడియో కేసులో బిగ్ ట్విస్ట్..దువ్వాడ మాధురి మెడకు చిక్కులు ?




















