రామ్ చరణ్ హీరోగా డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తోన్న మూవీ పెద్ది. ఈ మూవీలో చరణ్ కు జంటగా అతిలోకసుందరి శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ది సినిమాస్ బ్యానర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.
పెద్దిలో చరణ్ రెండు గెటప్స్ లో కనిపిస్తాడట. ఆల్రెడీ ఈ మూవీ గ్లింప్స్ లో ఒక గెటప్ చూపించారు. ఇప్పుడు రెండో గెటప్ కు సంబంధించిన సీన్స్ షూట్ చేస్తున్నారట. ఈ తాజా షెడ్యూల్ మైసూర్ లో జరగనుందని తెలిసింది. చరణ్ లుక్ కోసం ముంబాయి నుంచి ప్రత్యేకంగా హెయిర్ స్టైలీష్ట్ ఆలిమ్ హకీమ్ ను తీసుకొచ్చారని తెలిసింది. అతని పర్యవేక్షణలోనే కొత్త లుక్ ను డిజైన్ చేశారట. ఈ లుక్.. అలాగే ఈ గెటప్ లో వచ్చే సీన్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని చరణ్ పుట్టినరోజైన మార్చి 27న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.





