Team India: WTC ఫైనల్స్ కు టీమిండియా చేరే అవకాశం ఇంకా ఉందా..? ఎన్ని మ్యాచ్ లు గెలిస్తే అవకాశం

Team India: టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య నిన్నటితో రెండు టెస్టుల సిరీస్ పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ లో టీం ఇండియా దారుణంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా చేతిలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. బ్యాటింగ్, బౌలింగ్ అలాగే కోచ్ గౌతమ్ గంభీర్, ఇతర అన్ని కారణాలవల్ల అట్టర్ ఫ్లాఫ్ అయింది టీమ్ ఇండియా. ఈ ఓటమి నేపథ్యంలో గౌతమ్ గంభీర్ ను తొలగించాలని డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. కొత్త ను నియామకం చేయాలని ఫాన్స్ కోరుతున్నారు. Team India

Team India How can still qualify for WTC 2027 final after 2-0 series defeat against South Africa

అయితే 2027 వరకు గౌతమ్ గంభీర్ కోచ్ గా వ్యవహరిస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. ఇదంతా పక్కకు పెడితే, నిన్నటి ఓటమితో డబ్ల్యూటీసి ఫైనాన్స్ పాయింట్లు పట్టికలో ఐదవ స్థానానికి పడిపోయింది టీం ఇండియా. పాకిస్తాన్ నాలుగో స్థానానికి ఎగబాకింది. ఇలాంటి నేపథ్యంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కు టీమిండియా క్వాలిఫై కావడం గగనగా మారింది. ఈ టోర్నమెంట్ ఫైనల్ 2027 లో జరగనుంది. ఆ సమయానికి టీమిండియా మరో 9 టెస్టులు ఆడాల్సి ఉంటుంది. ఇందులో కనీసం ఏడు టెస్టులు విజయం సాధిస్తే 62.96%తో డబ్ల్యూటీసీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. Team India

Also Read: Smriti Mandhana: స్మృతి మందాన జీవితం నాశనం చేసింది ఈ లేడీనే ?

అదే 9 లో 8 గెలిస్తే, 68.52%తో డబ్ల్యూటీసి ఫైనల్ కు టీం ఇండియా వెళ్లి అవకాశాలు మెండుగా ఉంటాయి. అలా కాదని వరుసగా ఆరు మ్యాచులు గెలిచి, మిగిలిన మ్యాచ్లో టీమ్ ఇండియా ఓడిపోతే మాత్రం ఎలిమినేట్ కాక తప్పదు. ఇక ఈ తొమ్మిది టెస్టులు బలమైన జట్ల పైనే ఆడనుంది టీమిండియా. మొదట శ్రీలంకతో రెండు టెస్టులు, వాళ్ల గడ్డపైన ఆడనుంది. అలాగే న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టులు ఆడబోతోంది. ఇక మన సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది టీమిండియా. ఇందులో బతికి బయటపడితేనే టీమ్ ఇండియా మనుగడ ఉంటుంది. లేకపోతే మరో జింబాబ్వే కానుంది టీమిండియా. Team India

Also Read: Saikiran Yadav: ఖైరతాబాద్ బరిలో తలసాని శ్రీనివాస్ కొడుకు..నవీన్ యాదవ్ స‌పోర్ట్‌?