తెలుగు హీరోయిన్స్ పర్ఫార్మెన్స్తో సంచలనం
గత కొన్నేళ్లుగా టాలీవుడ్లో తెలుగు హీరోయిన్స్ స్టార్డమ్ విపరీతంగా పెరిగింది. ముందు ముంబై నుంచి వచ్చే హీరోయిన్లే డిమాండ్‌లో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అక్కడి నుంచి వచ్చి ఫేమ్, డబ్బు తీసుకుని పారిపోయే ట్రెండ్‌ను తెలుగమ్మాయిలు బ్రేక్ చేశారు. కరోనా తర్వాత ఈ జోరు మరింత ఎక్కువైంది. తమ పర్ఫార్మెన్స్తో క్లాస్ చూపించి, ఒక్క సినిమాతోనే ఫ్యాన్స్‌ను క్రియేట్ చేసుకుంటున్నారు.
Rising Telugu Actresses Performance
శ్రీ గౌరీప్రియ ‘చెన్నై లవ్ స్టోరీ’తో చెలరేగిపోయింది. స్మశానంలో ఆ సీన్ చూస్తే ఎవరైనా ఏడ్వకుండా ఉండలేరు. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు తప్పక రావాల్సిందే. మరో వైపు మానస వారణాసి ‘కపుల్ ఫ్రెండ్లీ’లో హెల్త్ ఇష్యూతో చనిపోయే సెటిల్డ్ పాత్రతో అందర్నీ కదిలించింది. వైష్ణవి చైతన్య ‘బేబీ’తో సంచలనం సృష్టించింది. ఆమె పాత్రను చూసి ప్రేక్షకులు తిట్టినంతగా, నటనలో లీనమైపోయింది. తేజస్వి ‘రాజు వెడ్స్ రాంబాయి’లో ఎయిడ్స్ బాధితురాలిగా విలేజ్ బ్యాక్ డ్రాప్‌తో అదరగొట్టింది. ఇవన్నీ ఒక్క పారా చాలు తెలుగు అమ్మాయిల టాలెంట్ ఎంత బలంగా ఉందో చెప్పడానికి.
శివాని నగరం క్యూట్ హీరోయిన్‌గా ట్రెండ్ సెట్ చేస్తోంది. ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’తో ఎంట్రీ ఇచ్చి, ‘లిటిల్ హాట్స్’, ‘హే బలవంత్’ వరుస హిట్స్ కొట్టేసింది. అనన్య నాగళ్ల ‘పొట్టెల్’, ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’లో కూడా పర్ఫామెన్స్‌తో ఝలక్ కొట్టింది. అయితే ఒక పెద్ద హిట్ లేదు. అదొచ్చిందంటే స్టార్ డమ్ ఖాయం. ఫారియా అబ్దుల్లా హైద్రాబాదీ భామ. ‘జాతిరత్నాలు’తో హిట్ కొట్టి, సింగర్, కంపోజర్‌గా కూడా షైన్ చేస్తోంది. రాబోయే ‘భగవంతుడు’ సినిమాతో ఆమె మరింత ఎత్తుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఈషారెబ్బ, నాగదుర్గ కూడా చిన్న సినిమాలతో తమ మార్క్ చూపిస్తున్నారు. చాందిని చౌదరి సీనియర్ అయినా, తగ్గ పర్ఫార్మెన్స్ రోల్ రాక ఇంకా స్టార్ కాలేదు. రాజశేఖర్ కూతుళ్లు శివాని, శివాత్మిక కూడా వరుసగా సినిమాలతో దూసుకెళ్తున్నారు.
మొత్తానికి ప్రస్తుతం డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తెలుగు హీరోయిన్స్ నే తీసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. కారణం భాషా ఇబ్బంది లేదు, ఖర్చు తగ్గుతుంది, మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఇప్పుడు తెలుగమ్మాయిల హవా మొదలైంది. వీరంతా సింపుల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి, షార్ట్ ఫిలిమ్స్ చేసి, ఇప్పుడు హీరోయిన్స్ గా ఎదిగారు. త్వరలో మరింత మంది న్యూ ఫేసెస్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంది మరి.
https://x.com/pakkafilmy007/status/1600352362639822848





